News February 25, 2026
మేడ్చల్: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 151 పరీక్షా కేంద్రాల్లో ఫస్ట్ ఇయర్‌లో G- 64,780, VOC- 1,368, సెకండ్ ఇయర్‌లో G-67,792, VOC- 1,258 మంది పరీక్షలు రాయనున్నారు. మొత్తం 1,35,198 మంది పరీక్ష రాయనున్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.
ALL THE BEST
Similar News
News April 14, 2026
అరుణాచల్ ప్రదేశ్ మాదే: చైనా

అరుణాచల్ ప్రదేశ్‌లో <<19633032>>గ్రామాల<<>> పేర్లు మార్చడంపై భారత్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నా చైనా తగ్గడం లేదు. అరుణాచల్ ప్రదేశ్ భారత భూభాగమే కాదని లేటెస్ట్‌గా ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జియాకున్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ అక్రమంగా ఏర్పాటు చేసుకుందని, దీనిని చైనా ఎప్పటికీ గుర్తించదన్నారు. అరుణాచల్‌ను జాంగ్‌నాన్ (దక్షిణ టిబెట్)గా పేర్కొంటూ.. ఇది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.
News April 14, 2026
వెరీ స్లో ఇన్నింగ్స్.. కోహ్లీపై చోప్రా విమర్శలు

ఈనెల 12న ముంబైతో మ్యాచులో RCB ఓపెనర్ విరాట్ కోహ్లీ చాలా స్లోగా ఆడారని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా విమర్శించారు. ‘RCB గెలిచినప్పటికీ T20 క్రికెట్ కోణంలో చూస్తే అది చాలా స్లో ఇన్నింగ్స్. విరాట్ స్థాయికి తగ్గట్లుగా లేదు. ఆయన మైండ్‌సెట్ కూడా సరిగా లేనట్లు అనిపించింది. వైడ్ బాల్స్ కోసం రెండు రివ్యూలు వృథా చేశారు’ అని తన యూట్యూబ్ వీడియోలో పేర్కొన్నారు. ఈ మ్యాచులో కోహ్లీ 38 బంతుల్లో 50 రన్స్ చేశారు.
News April 14, 2026
ప్రపంచ మేధావి అంబేడ్కర్: కలెక్టర్ వెట్రిసెల్వి

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అంబేడ్కర్ అని కలెక్టర్ వెట్రిసెల్వి కొనియాడారు. ఏలూరు కలెక్టరేట్‌లో అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్షపై రాజీలేని పోరాటం చేసిన అంబేడ్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.


