News April 3, 2025
మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు

మేడ్చల్ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టరేట్‌ను పేల్చేస్తామని, కలెక్టర్‌ను చంపేస్తామంటూ ఓ అగంతకుడు మెయిల్ పెట్టారు. ఈ విషయంపై విచారణ జరపాలని కలెక్టర్ గౌతమ్ డీసీపీ పద్మజ రెడ్డికి ఆదేశాలు ఇచ్చారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపించారు? అనే అంశంపై విచారణ చేస్తున్నారు. కాగా.. కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపు నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసర సమావేశమయ్యారు.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్‌లో BJP ‘కార్పెట్ బాంబింగ్’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రేపు కార్పెట్ బాంబింగ్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా పార్టీ స్టార్ క్యాంపెయినర్స్, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, రాజస్థాన్ సీఎం, తదితరులు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.
News October 26, 2025
రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ యూనిట్‌లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్‌లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.
News October 21, 2025
ఈనెల 25తో ముగియనున్న సర్వే: రంగారెడ్డి కలెక్టర్

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలు సలహాలు ఇవ్వాలన్నారు.


