News March 10, 2025

మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో 55 ఫిర్యాదులు

image

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 55 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. 

Similar News

News December 6, 2025

ప్చ్.. ప్రసిద్ధ్ కృష్ణ మళ్లీ..

image

రెండో వన్డేలో ధారాళంగా పరుగులిచ్చిన ప్రసిద్ధ్ కృష్ణను నేటి మూడో వన్డేకూ ఎంపిక చేయడంపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తొలి వన్డేలో అతడు 8.2 ఓవర్లకు 85రన్స్ ఇచ్చాడు. నేటి మ్యాచులోనూ 2 ఓవర్లకే 27 రన్స్ సమర్పించుకున్నాడు. అతడు వేసిన 11వ ఓవర్‌లో డీకాక్ 2 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. దీంతో షమీ లాంటి నాణ్యమైన బౌలర్లను వదిలేసి ఇలాంటి వారినెందుకు ఆడిస్తున్నారని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News December 6, 2025

రేపు రాత్రిలోపు రీఫండ్ చేయండి.. ఇండిగోకు కేంద్రం ఆదేశం

image

టికెట్లు రద్దయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్‌ చేయాలని ఇండిగోను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకు గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించవద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్‌లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది. అటు ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు క్యాన్సిల్ అయ్యాయి.

News December 6, 2025

వడ్లమానులో గుర్తుతెలియని మృతదేహం కలకలం

image

ఆగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామంలో గుర్తుతెలియని వృద్ధుని మృతదేహం శనివారం కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో ఎస్సై శుభశేకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. గ్రామంలోని ఓ ప్రైవేటు నర్సరీకి సమీపంలో గుర్తు తెలియని 65 ఏళ్ల వయోవృద్ధుడు మృతి చెంది ఉండడంతో వీఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.