News March 10, 2025

మేడ్చల్ కలెక్టరేట్ ప్రజావాణిలో 55 ఫిర్యాదులు

image

వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను డీఆర్ఓ హరిప్రియతో కలిసి అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, విజయేందర్ రెడ్డి స్వీకరించారు. మేడ్చల్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 55 ఫిర్యాదులు అందాయన్నారు. ఫిర్యాదులను పరిష్కరించాలని పలు శాఖల అధికారులను ఆదేశించారు. 

Similar News

News March 25, 2025

శ్రీగిరిపై ఉగాది కార్యక్రమాల ఇలా..!

image

శ్రీశైలం క్షేత్రంలో ఈ నెల 27 నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 27న మహాలక్ష్మి అలంకారం, బృంగి వాహన సేవ, 28న మహాదుర్గ అలంకారం, కైలాస వాహన సేవ, 29న మహాసరస్వతీ అలంకారం, ప్రభోత్సవం, నందివాహనసేవ వీరాచార విన్యాసాలు, అగ్నిగుండ ప్రవేశం, 30న ఉగాదిన శ్రీ రమావాణిసేవిత రాజరాజేశ్వరి అలంకారం, పంచాంగ శ్రవణం, రథోత్సవం, 31న శ్రీ భ్రమరాంబాదేవి నిజాలంకరణ, పూర్ణాహుతి, అశ్వవాహన సేవ జరుగుతుంది.

News March 25, 2025

వారి వలలో పడకండి: అన్నమయ్య ఎస్పీ

image

నకిలీ రుణ మోసాలు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయాయి. ఇవి ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయని అన్నమయ్య ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని ప్రకటనలు చేస్తారు. రుణం కావాలంటే మీ ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని సమర్పించాలని అడుగుతారు. రుణం మంజూరుకు ముందు కొంత డబ్బు చెల్లించాలని అడుగుతారు. వ్యక్తిగత సమాచారం తెలుసుకుని మోసం చేస్తారని చెప్పారు.

News March 25, 2025

భోజనం చేశాక ఇలా అనిపిస్తోందా?

image

కొందరికి భోజనం చేశాక పొట్టలో గడబిడగా ఉంటుంది. వేయించిన ఆహారం తీసుకున్నా, వేగంగా, పూర్తిగా నమలకుండా తీసుకున్నా కడుపులో ఉబ్బరం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని పట్టించుకోకపోతే ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. తిన్న వెంటనే కాకుండా 10 నిమిషాల తర్వాత వాకింగ్ చేయాలి. తిన్నాక డ్రింక్స్ తాగకూడదు. రాత్రి సమయంలో క్యాలిఫ్లవర్, క్యాబేజీ, ఉల్లి, వెల్లుల్లి, దుంపలు తీసుకోకూడదు.

error: Content is protected !!