News March 14, 2025
మేడ్చల్: కొత్త మున్సిపాలిటీలలో విలీనం అయ్యే గ్రామాలు (1/2)

మేడ్చల్ జిల్లాలో ప్రభుత్వం మూడు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేయనుంది. అలియాబాద్ మున్సిపాలిటీలో.. తుర్కపల్లి, లాగ్‌గడిమలక్‌పేట, మజీద్‌పూర్, మందాయిపల్లి, సింగాయిపల్లి, మురహరిపల్లి, యాచారం. మూడుచింతలపల్లిలో.. లింగాపూర్, ఉద్దేమర్రి, కేశవరం, నాగిశెట్టిపల్లి, కొల్తూర్, నారాయణపూర్, పోతారం, అనంతారం, లక్ష్మాపూర్, అద్రాస్పల్లి, ఎల్లగూడ, జగ్గంగూడ, సంపనబోలు, కేశవాపూర్ గ్రామాలు విలీనం కానున్నాయి.
Similar News
News February 8, 2026
‘అంబానీ ఇస్తేనేం.. రోహిత్‌కు డైటే ముఖ్యం’

T20Iలు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే WC-2027 ఆడేందుకు ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. నిన్న వాంఖడేలో మ్యాచ్‌కు హాజరైన రోహిత్ గ్యాలరీలో బిజినెస్‌మెన్ ముఖేశ్ అంబానీతో కలిసి మ్యాచ్ చూశారు. ఈ క్రమంలో ముఖేశ్ టీ ఆఫర్ చేయగా హిట్ మ్యాన్ తిరస్కరించారు. దీంతో రిచెస్ట్ మ్యాన్ ఆఫర్ చేసినా వద్దంటూ డ్రీమ్ కోసం కఠిన డైట్ పాటిస్తున్నారని రోహిత్ ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు.
News February 8, 2026
కామారెడ్డి జిల్లాలో చికెన్ ధరలు ఇలా….!

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో ఆదివారం మాంసం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. కిలో చికెన్ ధర రూ.270 నుంచి రూ.280 వరకు ఉండగా, లైవ్ కోడి ధర రూ.180గా ఉంది. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు స్వల్పంగా తగ్గాయి. అయితే మటన్ ధరలో ఎలాంటి మార్పు లేకుండా కిలో రూ.800 వద్దే కొనసాగుతోంది. సెలవు దినం కావడంతో మార్కెట్ల వద్ద మాంసం కొనుగోలుదారులు సందడి నెలకొంది.
News February 8, 2026
వరంగల్ సీపీ పేరిట ఫేక్ FACEBOOK అకౌంట్!

వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాను సృష్టించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఐపీఎస్ అధికారి ఫొటోతో తప్పుడు ప్రొఫైల్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ ఆర్థిక లావాదేవీలకు పాల్పడుతున్నారని సమాచారం. దీనిపై స్పందించిన సీపీ, తన పేరుతో వచ్చే నకిలీ సందేశాలను నమ్మవద్దని కోరారు. అపరిచితుల నుంచి వచ్చే రిక్వెస్ట్‌లను ఆమోదించవద్దని సూచించారు.


