News February 18, 2025

మేడ్చల్: క్రమశిక్షణ చర్యలు.. MRO బదిలీ

image

మేడ్చల్ MRO శైలజ బదిలీ అయ్యారు. ఆమెను నాగర్‌కర్నూల్ జిల్లాకు బదిలీ చేస్తూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ గౌతమ్ సూచనల మేరకు క్రమశిక్షణ చర్యల కింద ఆమెను బదిలీ చేసినట్లుగా పేర్కొన్నారు. కొంతకాలంగా ఆమె బదిలీపై ఊహాగానాలు జోరందుకోగా చివరకు FEB 8 తేదినే ఆమె బదిలీ అయినట్లు తెలుస్తోంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాలతో ఆమె వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Similar News

News November 16, 2025

HYD అమ్మాయితో iBOMMA రవి లవ్ మ్యారేజ్!

image

iBOMMA రవి గురించి ఆయన తండ్రి అప్పారావు పలు విషయాలు చెప్పారు. ‘ఎందుకు ఇలా చేశాడో తెలియదు. రాంగ్‌రూట్‌లో వెళ్లాడు. మేము చూసిన పిల్లను వద్దు అన్నాడు. తనకిష్టమని HYD అమ్మాయి నగ్మను పెళ్లి చేసుకున్నాడు. ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు విడాకులు తీసుకున్నాడు.’ అని అప్పారావు పేర్కొన్నారు. అయితే, కూకట్‌పల్లిలోని రెయిన్‌బో విస్టా వాసులకు రవి ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నట్లు సమాచారం.

News November 16, 2025

కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

image

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News November 16, 2025

లోక్‌ అదాలత్‌లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్‌ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.