News April 5, 2025
మేడ్చల్: గుండెపోటుతో చనిపోయిన విద్యార్థి ఇతనే

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో మరణించిన విద్యార్థి వివరాలు తెలిశాయి. ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ అనే విద్యార్థి, సీఎంఆర్ కాలేజీలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. తోటి విద్యార్థులతో కలసి క్రికెట్ ఆడుతుండగా ఆకస్మికంగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు వెంటనే ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
Similar News
News October 15, 2025
గద్వాల: ‘గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలు పరిష్కరించాలి’

గద్వాల జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పారిశుద్ధ్యం, విద్యుత్ తదితర సమస్యలు పరిష్కరించాలని సీపీఎం గద్వాల జిల్లా కార్యదర్శి వెంకటస్వామి, కమిటీ సభ్యులు నరసింహ పేర్కొన్నారు. ఇటీవల సీపీఎం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలపై సర్వే నిర్వహించారు. సర్వేలో పేర్కొన్న సమస్యలను అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ ఎలక్ట్రిసిటీ ఎస్సీకి వివరించి పరిష్కరించాలన్నారు. ఉప్పేరు నరసింహ పాల్గొన్నారు.
News October 15, 2025
ధాన్యం సేకరణ ప్రక్రియపై గద్వాల కలెక్టర్ సమీక్ష

ఖరీఫ్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు గద్వాల కలెక్టర్ సంతోష్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో ధాన్యం సేకరణ ప్రక్రియపై సమీక్ష జరిపారు.
News October 15, 2025
NMMS పరీక్ష దరఖాస్తు గడువు పెంపు: నిర్మల్ డీఈవో

NMMS పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు పెంచినట్లు డీఈఓ భోజన్న తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ (NMMS) పరీక్షకు ఆన్లైన్లో దరఖాస్తు నమోదు చేసుకోవడానికి ఈ నెల 18 వరకు గడువు ఉందన్నారు. వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.