News January 26, 2025
మేడ్చల్: జిల్లాలో ఇంటి స్థలం 8,193 మందికే..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 1.4 లక్షల మంది తమకు ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి 8,193 మందికి ఇంటి స్థలాలు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. అయితే మొదటి దశలో ఇంటి స్థలం ఉన్నవారికే ఇళ్లు కేటాయిస్తామని, తర్వాత మిగతా వారికి కేటాయిస్తామని ప్రభుత్వం తెలిపింది.
Similar News
News February 24, 2026
ఉగాదిలోపు ఇందిరమ్మ ఇళ్లు పూర్తి కావాలి: కలెక్టర్

జిల్లాలో స్లాబ్ దశలో ఉన్న 2,700 ఇందిరమ్మ ఇళ్లను ఉగాది నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్‌తో కలిసి ఆయన పనులను సమీక్షించారు. గృహ ప్రవేశాలకు సిద్ధం చేయడంతో పాటు డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించాలని, పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని అధికారులకు స్పష్టం చేశారు.
News February 24, 2026
వరంగల్ సూపర్ స్పెషాలిటీపై హరీశ్‌రావుకు మంత్రి దామోదర్ కౌంటర్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఖండించారు. బీఆర్ఎస్ హయాంలో పనులు 50% కూడా పూర్తికాలేదని, అశాస్త్రీయంగా వ్యయం పెంచారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రూ. 300 కోట్లు ఆదా చేసి పనులు వేగవంతం చేసిందన్నారు. 35 విభాగాలతో, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్, కేన్సర్ చికిత్స సహా ఆధునిక సేవలతో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
News February 24, 2026
వరంగల్‌లో హరీశ్ రావు వ్యాఖ్యలను ఖండించిన మంత్రి దామోదర

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలను మంత్రి దామోదర రాజనరసింహ మంగళవారం ఖండించారు. కేవలం భవనాలు కట్టి, జీవోలు ఇస్తే అభివృద్ధి కాదని.. ఆసుపత్రుల్లో వందల సంఖ్యలో డాక్టర్లు, సిబ్బంది, పూర్తిస్థాయి సౌకర్యాలు ఉండాలని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు కాదని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడమేనని స్పష్టం చేశారు. హరీశ్ రావు విమర్శలు అర్థరహితమని ఆయన మండిపడ్డారు.


