News January 27, 2025
మేడ్చల్ జిల్లాలో ఇళ్ల కోసం 27,086 కొత్త దరఖాస్తులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జనవరి 21 నుంచి నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 27,086 మంది ఇందిరమ్మ ఇళ్లు కావాలని దరఖాస్తులు చేసినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 351 సభలు నిర్వహించినట్లుగా రిపోర్టులను వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విడుదల చేశారు.
Similar News
News February 13, 2025
వరంగల్ జిల్లాలో భగ్గుమంటున్న ఎండలు!

వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి తగ్గి.. క్రమంగా ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఎండలు ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదని అభిప్రాయపడుతున్నారు. పొలం పనులకు వెళ్లాలంటేనే ఎండలకు భయపడుతున్నారు. మరోవైపు జిల్లాలోని పలు చోట్ల చెక్ డ్యామ్‌లు, చెరువులు సైతం ఎండే పరిస్థితికి వచ్చింది. మీ ప్రాంతంలో ఎండ తీవ్ర ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 13, 2025
నెల్లూరు: ప్రేమ పేరుతో లైంగిక దాడి

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడి చేసిన ఘటన వెంకటాచలం మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం..కసుమూరుకు చెందిన మస్తాన్‌బాబు ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఓ యువతి నమ్మింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనేకసార్లు లైంగికంగా వేధించాడని అన్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా ఒప్పుకోకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 13, 2025
వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.