News January 27, 2025

మేడ్చల్ జిల్లాలో కొత్తగా 33,435 రేషన్ దరఖాస్తు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో కొత్తగా 33,435 మంది రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్నట్లుగా జిల్లా యంత్రాంగం వెల్లడించింది. వీటిని క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం, ప్రభుత్వ ఆదేశాలతో ముందుకు వెళ్తామని తెలిపారు. మరోవైపు ఇప్పటికే గత ప్రజాపాలన దరఖాస్తుల ప్రకారం రూపొందించిన లిస్టులోని అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తామని ప్రకటించారు.

Similar News

News January 3, 2026

గద్వాల: ‘ఫార్మర్ రిజిస్ట్రీ వేగవంతం చేయాలి’

image

రైతుల భూములు, పంటలు ఇతర వివరాలు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసి యూనిక్ ఐడి ఇవ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను వేగవంతం చేయాలని గద్వాల కలెక్టరేట్ ఏవో భూపాల్ రెడ్డి సూచించారు. శనివారం ఐడీఓసీ మందిరంలో విలేజ్ లెవెల్ ఎంటర్ ప్లీనర్లకు ఇచ్చిన శిక్షణలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు రైతులకు సులభంగా అందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ ఉపయోగపడుతుందని వివరించారు.

News January 3, 2026

ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు కలెక్టర్ సన్మానం

image

గద్వాల జిల్లాలోని వివిధ పాఠశాలల్లో పనిచేసి ప్రతిభ కనబరిచిన 15 మంది ఉత్తమ మహిళ ఉపాధ్యాయులను కలెక్టర్ సంతోష్ శనివారం శాలువ, పూలమాలతో సన్మానించారు. దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి ఫూలే జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని 15 మంది టీచర్లకు పురస్కారాలు అందజేశారు. మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి విశేష కృషి చేశారని చెప్పారు. డీఈవో విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత పాల్గొన్నారు.

News January 3, 2026

అమరావతి రైతు సమస్యలపై ప్రభుత్వం ఫోకస్

image

AP: అభివృద్ధి చేసిన ప్లాట్లు సహా సమస్యల పరిష్కారంలో జాప్యంపై అమరావతి రైతులు అసంతృప్తి వ్యక్తపరచడం తెలిసిందే. ఈ తరుణంలో 2వ దశ భూ సమీకరణపై ప్రభావం పడకుండా GOVT అప్రమత్తమైంది. గ్రామాల్లో CRDA సభలు పెట్టి సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించాలని నిర్ణయించింది. ఇవాళ CRDA గ్రీవెన్స్ డేలో అత్యధిక ఫిర్యాదులను క్లియర్ చేశారు. కాగా లంక, అసైన్డ్ భూములపై చట్టం మేరకు పరిష్కరిస్తామని CRDA కమిషనర్ కన్నబాబు తెలిపారు.