News February 17, 2025

మేడ్చల్ జిల్లాలో పడిపోతున్న భూగర్భ జలాలు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రోజురోజుకు భూగర్భజలాలు పడిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు నెలల్లో 1.8 మీటర్లకు పైగా భూగర్భ జలం పడిపోయిందని పేర్కొన్నారు. రాబోయే వేసవికాలంలో మరింత అట్టడుగు స్థాయికి చేరే అవకాశం ఉన్నట్లుగా భూగర్భజల శాఖకు సంబంధించిన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి నెల నెల పీజో మీటర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 18, 2025

అలా చేస్తే పృథ్వీ షాను మించిన వారు లేరు: శశాంక్ సింగ్

image

ముంబై క్రికెటర్ పృథ్వీషాపై పంజాబ్ కింగ్స్ ఫినిషర్ శశాంక్ సింగ్ ప్రశంసలు కురిపించారు. ‘షాతో నాకు 13ఏళ్ల పరిచయం. జైస్వాల్, గిల్ వంటివారు మంచి ఆటగాళ్లే. కానీ షా గనుక తిరిగి తన బ్యాటింగ్ బేసిక్స్‌ను గుర్తుతెచ్చుకుని ఆడితే తనను మించినవారు లేరు. కష్టం, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, ఆటిట్యూడ్.. వీటి విలువ తెలుసుకుని తను గాడిలో పడాలి’ అని అభిలషించారు.

News March 18, 2025

అరకు కాఫీ తాగిన జిల్లా ఎమ్మెల్యేలు

image

దక్షిణ భారతదేశంలో ఎంతో పేరు పొందిన అరకు కాఫీ స్టాల్‌ను అసెంబ్లీ మెయిన్ ఎంట్రీ లాబీలో సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ స్టాల్‌ను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి శ్రీ, ఎంఎస్ రాజు, గుమ్మనూరు జయరాం సహచర ఎమ్మెల్యేలతో కలిసి సందర్శించారు. అక్కడ అరకు కాఫీ ప్రత్యేకతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సహచర ఎమ్మెల్యేలతో అరకు కాఫీ తాగారు.

News March 18, 2025

నేటి నుంచే అంగన్వాడీల్లో ఒంటి పూట: మంత్రి

image

AP: ఎండల తీవ్రత నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల్లో నేటి నుంచే ఒంటి పూట అమల్లోకి తీసుకొచ్చారు. ఉదయం 8 నుంచి 12 వరకు పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహించాలని మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

error: Content is protected !!