News January 31, 2025
మేడ్చల్ జిల్లాలో పిల్లల్లో పోషకాహార లోపం..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్నపిల్లల్లో పోషకాహార లోపం ఉన్నట్లు గుర్తించినట్లు ICDS అధికారిని శారద తెలిపారు. పోషకాహారం లోపం సవరించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువు కొలతలు తీసుకుని పౌష్టికాహారం అందిస్తున్నామన్నారు. 6 నెలల్లో 70 మంది చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని సరి చేశామని పేర్కొన్నారు.
Similar News
News February 25, 2026
విజయ్-రష్మిక పెళ్లి.. ఇండస్ట్రీ గెస్ట్ లిస్ట్ ఇదే

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఉదయ్‌పూర్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. కేవలం సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్యే ఈ వేడుక జరుగుతున్నప్పటికీ.. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వీరిలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా, శ్రావ్య వర్మ, ఆషికా రంగనాథ్, రాహుల్ రవీంద్రన్ వంటివాళ్లు ఉన్నారు. రేపు జరగనున్న ఈ పెళ్లికి మొత్తంగా 100 మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం.
News February 25, 2026
పాకిస్థానీల బెదిరింపులు.. లండన్‌లో ఇండియన్ రెస్టారెంట్ బంద్!

లండన్‌లో 16 ఏళ్లుగా భారతీయ వంటకాలను వడ్డిస్తున్న ‘రంగ్‌రేజ్’ రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు దాని ఓనర్ హర్మన్ సింగ్ కపూర్ ప్రకటించారు. పాకిస్థానీల నుంచి ఎదురవుతున్న దాడులు, ఆన్‌లైన్ వేధింపులు, పోలీసుల నుంచి సరైన మద్దతు లభించకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఆరోపించారు. ఖలిస్థాన్ ఉద్యమాన్ని విమర్శిస్తూ SMలో వీడియో పోస్ట్ చేసినప్పటి నుంచి కపూర్ కుటుంబానికి బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం.
News February 25, 2026
‘కేరళం’ సరే.. ప్రాజెక్టులేవీ: శశి థరూర్

కేరళ పేరును ‘కేరళం’గా మారుస్తూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలపడంపై MP శశి థరూర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మలయాళంలో ఇప్పటికే కేరళం అనే పిలుస్తారని, ఇప్పుడు ఆ పదాన్ని ఇంగ్లీషులోకి తీసుకురావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. పేరు మార్పుపై చూపిస్తున్న శ్రద్ధను రాష్ట్ర అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. బడ్జెట్‌లో కేరళకు ఒక్క కొత్త ప్రాజెక్టూ ఇవ్వలేదని, AIIMS వంటి కీలక సంస్థలను కేటాయించలేదని ఆరోపించారు.


