News January 26, 2025

మేడ్చల్ జిల్లాలో పెద్ద కార్పొరేషన్ బోడుప్పల్

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 కార్పొరేషన్లలో అతిపెద్ద కార్పొరేషన్‌గా బోడుప్పల్ ఉంది. దాదాపుగా 1.5 లక్షల జనాభాతో, 162 కాలనీలతో బోడుప్పల్ కార్పొరేషన్ విస్తరించి ఉంది. అయితే ప్రతి ఏడాది సుమారు రూ.60 కోట్ల మేరకు ఆదాయం వస్తుందని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ సకల వసతులు కల్పించి, ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 22, 2025

బాపట్ల: ‘ఈ అంగన్వాడీలో పనిచేసే కార్యకర్తల వేతనం పెరుగనుంది’

image

బాపట్ల జిల్లాలోని 16 మినీ అంగన్వాడీ కేంద్రాలను సాధారణ అంగన్వాడీ కేంద్రాలుగా మారుస్తున్నట్లు కలెక్టర్ డా.వినోద్ కుమార్ తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, ప్రీస్కూల్ విద్యార్థులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. మార్పుతో కార్యకర్తల గౌరవ వేతనం రూ.7,000 నుంచి రూ.11,500కు పెరుగుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News November 22, 2025

బెంగళూరు ట్రాఫిక్ కంటే అంతరిక్ష ప్రయాణమే సులువు: శుభాంశు

image

భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు బెంగళూరు ట్రాఫిక్ చిరాకు తెప్పించింది. టెక్ సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన అక్కడి ట్రాఫిక్ కష్టాలపై చమత్కరించారు. ‘బెంగళూరులోని ఈ ట్రాఫిక్‌ను దాటడం కంటే అంతరిక్షంలో ప్రయాణించడం చాలా సులువు’ అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ‘మారతహళ్లి నుంచి ఈవెంట్‌కు రావడానికి ప్రసంగానికి కేటాయించిన సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ పట్టింది’ అని నవ్వుతూ నగర ప్రజల బాధను హైలైట్ చేశారు.

News November 22, 2025

పుంగనూరు: రూ.770కు చేరిన టమాటా

image

తుఫాను నేపథ్యంలో టమాటా దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పుంగనూరులోని మార్కెట్ యార్డుకు శనివారం 57.94 మెట్రిక్ టన్నుల కాయలు వచ్చాయి. నాణ్యత కలిగిన టమాటా 15 కిలోల బాక్స్ రూ.770 పలికింది. రెండో రకం రూ.500, మూడో రకం రూ.300 చొప్పున కొనుగోలు చేశారు.