News February 4, 2025
మేడ్చల్ జిల్లాలో రూ.29.56 కోట్ల రుణమాఫీ

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీ ఇప్పటి వరకు 4,371 మంది రైతులకు రూ.29.56 కోట్ల వరకు మేలు జరిగినట్లు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పథకాలను అమలు చేసేందుకు పకడ్బండిగా చర్యలు చేపడుతున్నట్లుగా మేడ్చల్ కలెక్టర్ పేర్కొన్నారు.
Similar News
News January 16, 2026
ఆవులకు దిష్టి తీయడం మరవకండి

భోగి నాడు చిన్నారులపై భోగి పళ్లు పోసి దిష్టి తీసినట్లుగానే, కనుమ నాడు పాడి పశువులకు దిష్టి తీయాలని పండితులు సూచిస్తున్నారు. వాటిపై చెడు ప్రభావం పడకూడదన్నా, ఆయుష్షు పెరగాలన్నా రైతన్నలు ఈ ఆచారం పాటించాలంటున్నారు. పసుపు, కుంకుమలు కలిపిన నీటితో, హారతితో పశువులకు దిష్టి తీయాలి. అవి లక్ష్మీ స్వరూపంతో సమానం. ఇలా చేస్తే పశుసంపద సంక్షేమంగా ఉండి, రైతు ఇల్లు పాడి పంటలతో కళకళలాడుతుందని పండితులు చెబుతున్నారు.
News January 16, 2026
నేటి నుంచి సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. కొరాట-చనాక బ్యారేజ్ నుంచి నీటిని విడుదల చేసిన అనంతరం సదర్మాట్ బ్యారేజ్‌ను ప్రారంభిస్తారు. రేపు మహబూబ్‌నగర్, ఎల్లుండి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంతో పాటు ఉపాధి హామీ పథకం పేరు మార్పుకు నిరసనగా సభలు నిర్వహించనున్నారు.
News January 16, 2026
శ్రీకాకుళం జిల్లాలో నేడు భోగి జరుపుకొనే ప్రాంతమిదే!

శ్రీకాకుళం జిల్లాలోని ఆ ప్రాంతవాసులు భోగి పండుగనే జరుపుకోరు. నేడు (కనుమ) రోజున ఈ వేడుకను నిర్వహించి.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారు. మెళియాపుట్టిలోని కొసమాల గ్రామంలో దేవాంగుల వీధిలోని చేనేతలే ఇలా భోగిని భిన్నంగా చేస్తారు. వృత్తి రీత్యా పనుల్లో తీరిక లేకపోవడమే ప్రధాన కారణం. ఆనాటి పూర్వీకుల ఆచారాన్నే ఇప్పటికీ ఆ వృత్తుల వారు కొనసాగిస్తున్నారు.


