News January 25, 2025
మేడ్చల్ జిల్లాలో వారికి ఏటా రూ.12 వేలు..!

మేడ్చల్ జిల్లాలో భూమిలేని వ్యవసాయ నిరుపేద కూలీలకు ఏటా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం పేరిట రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.ఈ నేపథ్యంలో డీఆర్డీఓ అధికారులు సర్వే చేసి 1074 మంది అర్హులైన లబ్ధిదారులను అధికారులు గుర్తించారు. ప్రభుత్వం రేపటి నుంచే ఈ పథకాన్ని ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.
Similar News
News October 19, 2025
HYD: మంత్రి పేషీ అడ్డాగా ఐటీ ప్రాజెక్ట్ పేరుతో మోసం

సచివాలయం ఐటీ మంత్రి పేచీ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. మంత్రి పేషీని అడ్డాగా చేసుకొని ఐటీ ప్రాజెక్ట్ మంజూరు చేస్తామంటూ మోసం చేశారు. మియాపూర్ ఐటీ ఇంజినీర్ను లక్ష్యంగా చేసుకుని నకిలీ పత్రాలతో రూ.1.77 కోట్లు కాజేశారు. మంత్రి ఓఎస్డీ లెటర్హెడ్లు, నకిలీ పత్రాలు చూపి మోసగాళ్లు నమ్మించారు. బాధితుడి ఫిర్యాదుతో ఆరిగురిపై సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, విచారణను సీసీఎస్కు బదిలీ చేశారు.
News October 19, 2025
సామర్లకోటలో అత్యధిక వర్షపాతం నమోదు

గడచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 1,026 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సగటున జిల్లా వర్షపాతం 48.9 గా నమోదైంది. అత్యధికంగా సామర్ల కోటలో 132.4, అత్యల్పంగా కరపలో 12.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలోని 21 మండలాల్లో కూడా వర్షం పడినట్లు అధికారులు వెల్లడించారు.
News October 19, 2025
ములుగు: మావోయిస్టు పార్టీకి పెద్ద సవాళ్లు!

వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పెద్ద సవాళ్లు ఎదుర్కొంటోంది. నక్సలైట్ సంస్థ నడిపే పొలిట్ బ్యూరో కూడా దాదాపు ఖాళీగానే ఉంది. పోలీట్ బ్యూరో కేంద్ర కమిటీలో ఒకప్పుడు 17 మందికి పైగా సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8 మంది కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలిట్ బ్యూరోలో మిసిర్ బెస్రా, తిరుపతి@దేవ్ జీ, గణపతి, సీసీ కమిటీ సభ్యులు మాడవి హిడ్మా, రామన్న, గణేశ్, ఉదయ్ ఉన్నారు.