News April 7, 2025
మేడ్చల్ జిల్లాలో విపరీతంగా ఉక్కపోత..!

మేడ్చల్ జిల్లాలో ఉక్కపోత రోజురోజుకు అధికమవుతోంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ఉప్పల్, ఈసీఐఎల్, మేడ్చల్, మల్లాపూర్ ప్రాంతాల్లో తీవ్ర ఉక్కపోత ఉంటుందని TGDPS తెలిపింది. బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా తగినన్ని నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పట్ల మరింత జాగ్రత్త పడాలన్నారు.
Similar News
News December 4, 2025
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.
News December 4, 2025
స్పోర్ట్స్ రౌండప్

➤ నేటి నుంచి యాషెస్ రెండో టెస్టు(డేఅండ్‌నైట్).. బ్రిస్బేన్ వేదికగా మ్యాచ్
➤ ది హండ్రెడ్ లీగ్‌లో రిలయన్స్ ఎంట్రీ. ఓవెల్ ఇన్విసిబుల్ జట్టులో 49% వాటా కొనుగోలు. టీమ్ పేరు MI లండన్‌గా మార్పు
➤ నేడు అజిత్ అగార్కర్ బర్త్ డే.. ఆయన పేరు మీదే భారత్ తరఫున వన్డేల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(21 బాల్స్)
➤ ICC వన్డే ర్యాంకింగ్స్‌లో 5 నుంచి నాలుగో స్థానానికి చేరిన కోహ్లీ.. టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్న రోహిత్
News December 4, 2025
నేడు, రేపు భారత్‌లో పుతిన్ పర్యటన

రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండ్రోజుల పర్యటనకు నేడు భారత్ రానున్నారు. రాత్రి 7గంటలకు ఢిల్లీ చేరుకొని PM మోదీ ఇచ్చే విందుకు హాజరుకానున్నారు. రేపు ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత మోదీ-పుతిన్ మధ్య భేటీ జరగనుంది. పుతిన్ కోసం NSG కమాండోలు, స్నైపర్స్, డ్రోన్లు, AIతో ఐదంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. 2021 తర్వాత మళ్లీ ఆయన భారత్‌కు రావడం ఇదే.


