News February 3, 2025

మేడ్చల్ జిల్లాలో 29.48 లక్షల మంది ఓటర్లు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా త్వరలోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 29.48 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 15.17 లక్షలు కాగా.. మహిళలు 14.30 లక్షలు, ఇతరులు 416 మంది ఉన్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News November 26, 2025

తెంబా బవుమా.. ఓటమి ఎరుగని నాయకుడు

image

SA క్రికెట్‌లో అద్భుతమైన నాయకుడిగా తనదైన ముద్ర వేస్తున్న కెప్టెన్ తెంబా బవుమా ఇప్పుడు కొత్త సంచలనాలను నమోదు చేస్తున్నారు. 27ఏళ్ల తర్వాత తన జట్టుకు తొలి ICC టైటిల్ అందించిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్‌గా ఆయన నిలిచిన విషయం తెలిసిందే. తాజా సిరీస్ విజయంతో 25ఏళ్ల తరువాత భారత్‌లో టెస్ట్ సిరీస్ గెలిపించిన కెప్టెన్‌ అయ్యారు. 12 మ్యాచ్‌ల్లో 11 విజయాలు, 1 డ్రాతో విజయవంతమైన కెప్టెన్లలో ఒకరుగా ఉన్నారు.

News November 26, 2025

ASF: డిజిటల్ వివరాలను టీ పోల్‌లో నమోదు చేయాలి

image

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ.రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఆమె పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ASF జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రేతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. పోలింగ్ క్రేంద్రాల జాబితా, డిజిటల్ వివరాలను టీ పోల్‌లో నమోదు చేయాలన్నారు.

News November 26, 2025

పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మామ, అల్లుడి మృతి

image

పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, అతని అల్లుడు ప్రవీణ్ బైక్‌పై రంగాపురం నుంచి పెబ్బేరుకు వస్తుండగా బైపాస్ వద్ద హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వారిని చికిత్స కోసం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు రమేష్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.