News January 26, 2025
మేడ్చల్ జిల్లా పురపాలికల్లో సకల సమస్యలు..!

మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు,9 మున్సిపాలిటీల నుంచి పన్నుల ద్వారా రూ.175 కోట్లు వస్తుండగా,15వ ఆర్థిక సంఘం ద్వారా కూడా ప్రతి నెల ఒక్కొక్క పురపాలక సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.21 లక్షల నిధులు విడుదలవుతున్నాయి.ఈ నిధులతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి సమస్యలు పరిష్కరించాల్సి ఉండగా, ఏళ్లుగా డ్రైనేజీ, రోడ్ల సమస్యలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. అనేక మంది ప్రజలు ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు.
Similar News
News December 2, 2025
ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్ తేజస్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్ సూచించారు.
News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
News December 2, 2025
ఐఐసీటీ హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని CSIR-<


