News April 16, 2025
మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా టీబీ రోగులకు పౌష్టికాహార కిట్లు

ఉప్పల్ పీహెచ్సీలో టీబీ ముక్త భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాన్ ఇండియా ఆర్గనైజేషన్ ద్వారా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 750 టీబీ రోగులకు 1,500 పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీబీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమా గౌరీ, టిబి డాక్టర్ శ్రీదేవి పాల్గొన్నారు. మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చని అధికారులు తెలిపారు.
Similar News
News November 25, 2025
19 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి

ఖమ్మం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న 19మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించింది. సీపీ సునీల్ దత్ మంగళవారం వారికి పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. వీరిలో నలుగురిని మహబూబాబాద్‌కు, 14 మందిని భద్రాద్రి కొత్తగూడెంకు, ఒకరిని ఇతర విభాగానికి కేటాయించారు.
News November 25, 2025
జనవరి నుంచి కొత్త డిస్కం.. నేడు నిర్ణయం

తెలంగాణలో జనవరి 2026లో కొత్త విద్యుత్ డిస్కం ఏర్పాటుపై ఈ మధ్యాహ్నం క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనుంది. దీంతో ఇప్పటికే రూ.59,671 కోట్ల నష్టాల్లోని TGSPDCL, TGNPDCLలపై సబ్సిడీ సరఫరా భారం తగ్గనుంది. వ్యవసాయానికి ఫ్రీ కరెంట్, పేదలకు 200 యూనిట్లు ఫ్రీ, మిషన్ భగీరథ & HYD వాటర్ బోర్డు కొత్త డిస్కంలో ఉంటాయి. దీంతో పాటు మరిన్ని విద్యుత్ సంస్కరణలు నేటి భేటీలో చర్చకు వస్తాయని సమాచారం.
News November 25, 2025
ఏటూరునాగారం: ఐటీడీఏలో దాహం.. దాహం!

ఏటూరునాగారంలోని గిరిజన సహకార సంస్థ ఐటీడీఏలో 3 నెలలుగా మినరల్ వాటర్ ప్లాంట్ పని చేయడం లేదు. వివిధ పనుల నిమిత్తం, గిరిజన దర్భారుకు వచ్చే గిరిజనులు దాహార్తికి ఇబ్బంది పడుతున్నారు. బయట షాపుల్లో డబ్బులు వెచ్చించి వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి తాగాల్సి వస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజనుల సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏలో కనీసం తాగునీటి సదుపాయం లేకపోవడం గమనార్హం.


