News February 3, 2025

మేడ్చల్: దివ్యాంగులకు GOOD NEWS

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా దివ్యాంగులకు మీసేవ అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. వినికిడి సమస్య, శారీరక అంగవైకల్యం, మానసిక వైకల్యం ఉన్నవారికి సదరం సర్టిఫికెట్ అందించడం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఈ సేవలు అందరు సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం మీ సేవలో స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే చాలామంది ప్రయోజనం పొందినట్లు Xలో ట్వీట్ చేశారు.

Similar News

News February 20, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 20, 2025

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగొద్దు: KMR కలెక్టర్

image

విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. కామారెడ్డి కాకతీయ నగర్ లోని 33/11 కే.వి. ఉప కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. విద్యుత్ ఎంత మేరా సరఫరా అవుతుంది. సరఫరాలో అంతరాయం ఏర్పడినప్పుడు తీసుకునే ప్రత్యామ్నాయ చర్యలు, తదితర విషయాలను ఎస్ఈ ఎన్.శ్రావణ్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.

News February 20, 2025

ఫిబ్రవరి 20: చరిత్రలో ఈరోజు

image

1935: ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డి జననం
1946: దివంగత నటి, దర్శకురాలు విజయ నిర్మల జననం
1973: సంగీత దర్శకుడు టి.వి.రాజు మరణం
2010: నటుడు బి.పద్మనాభం మరణం
* ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం

error: Content is protected !!