News February 3, 2025
మేడ్చల్: పథకాల్లో 60% నిధులు కేంద్రానివే: MP

రాష్ట్రంలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వ 40% నిధులు కేటాయిస్తుందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కోట్లాది రూపాయలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కోసం ఖర్చు పెట్టిందని, ఇప్పటికీ ఖర్చు పెడుతూ ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇతర నేతలు దీన్ని అర్థం చేసుకోవాలన్నారు.
Similar News
News December 3, 2025
బంధం బలంగా ఉండాలంటే ఆర్థిక భద్రత ఉండాల్సిందే!

మానవ సంబంధాల బలోపేతానికి ఆర్థిక సంబంధాలు కీ రోల్ పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. జీవితంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు, భావోద్వేగ మద్దతు, సామరస్యం చాలా ముఖ్యమని, కానీ వీటికి తోడు ఆర్థిక భద్రత ఉన్నప్పుడే అవి మరింత పటిష్టంగా ఉంటాయని సైకాలజీ టుడే, యూగోవ్ సంస్థలు నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థిక భద్రత లేదా స్థిరత్వం లేకపోతే చాలా వరకు సంబంధాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
News December 3, 2025
సిద్దిపేట: సర్పంచ్ గిరి అస్సలే వద్దు..!

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి పలువురు తాజా మాజీలు వెనుకంజ వేశారు. పల్లెపోరులో కొత్తవారే అత్యధికంగా ఉన్నారు. జిల్లాలో 514 GPల పరిధిలో మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రెండు దశల్లోనూ తాజా మాజీ సర్పంచులు పోటీకి ఆసక్తి చూపట్లేరు. సర్పంచ్ గిరితో నష్టమే తప్ప లాభం లేదని, గతంలోని బిల్లులే పెండింగ్లో ఉన్నాయని, నిధులు రావని వారు భావిస్తున్నారు.
News December 3, 2025
తూప్రాన్: ఈ ఒక్క దరఖాస్తు తీసుకోండి సారూ..!

తూప్రాన్ పట్టణంలో నామినేషన్ల చివరి రోజు ఆఖరి క్షణంలో వచ్చిన ఓ అభ్యర్థి సారూ.. నా నామినేషన్ తీసుకోమంటూ కనిపించిన వారినందరినీ అభ్యర్థించారు. మండలంలోని ఇస్లాంపూర్కు చెందిన గొల్ల కిష్టయ్య చివరి క్షణంలో నామినేషన్ వేసేందుకు నిశ్చయించి, రెండు నిమిషాల ముందు వచ్చాడు. నామినేషన్ పత్రాలు పూరించినప్పటికీ సమయం గడిచిపోయింది. నామినేషన్ పత్రాలు పట్టుకొని సార్.. ఈ ఒక్క నామినేషన్ తీసుకోండి అంటూ వేడుకున్నారు.


