News April 4, 2025
మేడ్చల్: ‘పాలిటెక్నిక్ వాళ్లకు అగ్నివీర్ అవగాహన’

మేడ్చల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు ఆర్మీ మిలిటరీ బృందం అగ్నివీర్ రిక్రూట్మెంట్, ఉమెన్ మిలిటరీ పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించిన అంశాల గురించి అవగాహన కల్పించారు. జాయిన్ ఇండియన్ ఆర్మీ పోస్టర్ విడుదల చేసిన ఆర్మీ అధికారులు, చిన్నతనంలోనే దేశం కోసం సేవ చేసేందుకు అద్భుత అవకాశం ఉందని తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 19, 2025
కాజీపేట: మహిళా కానిస్టేబుల్ సూసైడ్

మహిళా కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేటలోని దర్గా ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ అర్చనకు 2022లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే ఆమెకు భర్తతో విడాకులు కావడంతో మానసికంగా బాధపడింది. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడింది.

గద్వాల్: భూభారతితో రైతులకు భద్రత: పొంగులేటి

భూభారతి 2025 చట్టం రైతులకు మరింత భద్రత కల్పిస్తుందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గద్వాల్ జిల్లా ధరూర్ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో భూభారతి చట్టంపై నిర్వహించిన సదస్సుకు మంత్రి హాజరై, మాట్లాడారు. గతంలో ధరణి వల్ల రైతులు ఇబ్బంది పడ్డారని, వాటిని తొలగించేందుకు ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చిందన్నారు. రైతు సమస్యలు తొలుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.