News March 14, 2025
మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీ

మేడ్చల్ పోలీసు క్రికెట్ లీగ్ టోర్నీలో భాగంగా పోలీసు బృందం విజయం సాధించింది. పోలీసులకు, జర్నలిస్టులకు జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. టాస్ గెలిచిన పోలీసు బృందం మొదట బ్యాటింగ్ చేసి 69 రన్స్ చేసింది. 69 రన్స్‌కు గానూ జర్నలిస్టు బృందం 67 రన్లు తీసి రన్నర్‌గా నిలిచింది. రెండు రన్ల తేడాతో పోలీస్ టీం విజయం సాధించింది. కాగా మాన్ అఫ్ ది మ్యాచ్ విలేఖరి రాజశేఖర్‌కు దక్కింది.
Similar News
News March 15, 2025
జగన్ మరో 20ఏళ్లు కలలు కనాలి: నాగబాబు

AP: నోటి దురుసు ఉన్న నేతకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. వచ్చేసారి అధికారం తమదే అని జగన్ అంటున్నారని అంతకన్నా హాస్యం మరోటిలేదన్నారు. మరో 20సంవత్సరాలు జగన్ ఇలానే కలలు కంటూ ఉండాలని కోరారు. దేవుడైనా అడిగితే వరాలు ఇస్తాడు కానీ పవన్ అడగకుండానే వరాలు ఇస్తాడని కొనియాడారు. రెండు మూడు తరాల గురించే ఆలోచించే వ్యక్తి ఆయనని అందుకే అయనకు అనుచరుడిగా ఉంటున్నానని తెలిపారు.
News March 15, 2025
భారత్‌కు రావొద్దని నన్ను బెదిరించారు: వరుణ్ చక్రవర్తి

2021 టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా ఎవరో నన్ను ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను’ అని గుర్తుచేసుకున్నారు.
News March 15, 2025
సిద్దిపేట: గ్రూప్-3లో సత్తా చాటిన యువకుడు

తొగుట గ్రామానికి చెందిన ముచ్చర్ల శ్రీకాంత్ యాదవ్ గ్రూప్-3 ఫలితాలలో సత్తా చాటాడు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో 232 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం గ్రూప్-4 ఆఫీసర్‌గా HMDAలో విధులు నిర్వహిస్తున్నాడు. తన ప్రిపరేషన్ కొనసాగిస్తూ గ్రూప్-1 సాధించి డీఎస్పీ అవ్వడమే తన లక్ష్యమని ముచ్చర్ల శ్రీకాంత్ తెలిపాడు.