News February 12, 2025
మేడ్చల్: ఫీజు కోసం వేధింపులు.. ఆత్మహత్యాయత్నం

మేడ్చల్‌లో స్కూల్ ఫీజుల వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి తల్లి ఆవేదన.. పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న తమ కుమార్తె అఖిలను పాఠశాల ప్రిన్సిపల్ ఫీజు కోసం వేధించడంతో ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం అఖిల ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కాగా.. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 26, 2026
కబడ్డీ పోటీల్లో ఎమ్మెల్యే పార్థసారథికి గాయం

అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్‌లో భాగంగా జరిగిన కబడ్డీ మ్యాచ్‌లో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గాయపడ్డారు. ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను పట్టుకునే ప్రయత్నంలో ఆయన కిందపడటంతో పాదం భాగంలో గాయమైంది. బుధవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఈ విషయాన్ని గుర్తించారు. క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న ఆయనకు గాయం కావడంతో తోటి ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు.
News February 26, 2026
NRPT: డయల్ యువర్ డీఎం.. కాల్ చేయండి

డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపోల పరిధిలోని ప్రయాణికులు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి ఆర్టీసీ సేవలు, సమస్యలు, సలహాలు, సూచనలు ఫోన్ ద్వారా తెలియజేయాలని చెప్పారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని చెప్పారు. కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
News February 26, 2026
BELలో 72 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


