News January 27, 2025
మేడ్చల్: మాకూ రూ.12 వేలు ఇవ్వండి!

భూమిలేని నిరుపేదలైన వ్యవసాయ కూలీలకు ప్రతి ఏటా ప్రభుత్వం రూ.12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా జనవరి 21 నుంచి 24 వరకు జరిగిన గ్రామ, వార్డు సభల్లో వ్యవసాయ కూలీలు తమకు సైతం భూమిలేదని, పథకం అందించాలని 1,245 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. గత దరఖాస్తుల్లో ఇప్పటికే 1,074 మంది అర్హులుగా గుర్తించారు.
Similar News
News November 27, 2025
ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.
News November 27, 2025
లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

AP: మంత్రి లోకేశ్ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజమైతే బ్యాంక్ స్టేట్మెంట్ను బయట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.
News November 27, 2025
VKB: ‘మెరుగైన వైద్య సేవలు అందించాలి’

గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లోని వైద్యాధికారి కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వర్ణకుమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న క్షేత్రస్థాయి పర్యవేక్షక సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలన్నారు.


