News April 1, 2025
మేడ్చల్: మొదటి దశలో 308 ఇందిరమ్మ ఇళ్లు !

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,43,267 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని సర్వే చేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా కేవలం 8,475 మందికి మాత్రమే సొంత ఇంటి నిర్మాణానికి స్థలాలున్నట్టు గుర్తించారు. అందులో కూడా నిరుపేదలను గుర్తించి 308 ఇళ్లను అధికారులు మొదటి ఫేజ్ కింద మంజూరు చేశారు.
Similar News
News April 18, 2025
పోచంపల్లితో వినోబా భావేకు విడదీయని అనుబంధం

ఆచార్య వినోబా భావేకు <<16135013>>పోచంపల్లితో <<>>విడదీయని అనుబంధం ఉంది. మొదటిసారి 1951లో పోచంపల్లికి వచ్చారు. అలాగే 1956 జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా రెండోసారి వచ్చారు. భూదానోద్యమానికి కార్యోన్ముఖునిగా నిలిచిన పోచంపల్లిని భూదాన గంగోత్రిగా అభివర్ణిస్తూ తన రెండో జన్మస్థలంగా వినోబా భావే పేర్కొనడం విశేషం. వినోబా భావే మరణాంతరం భారత ప్రభుత్వం ఆయన ఆవిశ్రాంత కృషికి గాను 1982లో ‘భారతరత్న’ బిరుదును ప్రకటించింది.
News April 18, 2025
రాజన్న సిరిసిల్ల రచయితకు అరుదైన గౌరవం

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయన రచించిన జిగిరీ నవల, అనగనగా ఓ కోడిపెట్ట, గోస కథలను WGLలోని 85 ఏళ్ల చరిత్ర గల శ్రీ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర పీజీ కళాశాల విద్యార్థులకు సిలబస్‌గా అమలు చేసింది. విశేషం ఏంటంటే, ఈ కథల్ని బోధించేందుకు రచయితకే అవకాశం కల్పించారు. ఈరోజు సాయంత్రం అశోక్ కుమార్ విద్యార్థులకు కథల సారాంశాన్ని బోధించనున్నారు.
News April 18, 2025
హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.