News April 6, 2025
మేడ్చల్: రూ.1,246.48 కోట్ల RTA పన్నులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.1,246.48 కోట్లు వచ్చినట్లుగా ఆర్టీఏ అధికారులు వెల్లడించారు. చివరి నెల రోజుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించగా పన్ను వసూళ్లు పెరిగినట్లుగా పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా దాదాపు 84 లక్షలకు పైగా వాహనాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Similar News
News April 20, 2025
NLG: కమ్మని కల్లు.. మనసు జిల్లు!

ఈ ఏడాది జిల్లాలో కల్లుకు డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం భారీగా మద్యం ధరలు పెంచడంతో ఎక్కువ మంది కల్లు కిక్కును కోరుకుంటున్నారు. ప్రస్తుతం తాటి కల్లు సీజన్ కావడంతో మందుబాబులు ఆ మత్తు పానీయం కోసం పరుగులు తీస్తున్నారు. ధర తక్కువ కావడంతో పేదలు, కూలీలు దీనిని సేవిస్తుంటారు. జిల్లాలో చాలాచోట్ల కల్లు ధరలు పెరిగినా ఆరోగ్యానికి మంచిది కావడంతో చాలామంది కల్లువైపే ఆసక్తి చూపుతున్నారు.
News April 20, 2025
జగిత్యాల: నిజాయతీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్ శ్యామల

జగిత్యాల వాసి గుగ్గిల మనోజ్ఞ నిర్మల్ డిపో బస్సు TS18T 4456లో పర్సును సీటుపై మర్చిపోయారు. డిపోలో బస్సును అప్పగించేటప్పుడు కండక్టర్ శ్యామలకు పర్సు కనబడింది. వెంటనే పర్సును డిపో క్లర్క్‌కు అప్పగించారు. అందులో రూ.2వేల నగదు, చెవి కమ్మలు ఉన్నాయి. ప్రయాణికురాలిని డిపోనకు పిలిపించి క్లర్క్ ఎన్.ఆర్ శేఖర్ అప్పజెప్పారు. కండక్టర్ శ్యామలను అభినందించారు.
News April 20, 2025
‘నిన్ను చాలా మిస్ అవుతున్నా’.. మహేశ్ ఎమోషనల్ పోస్ట్

తన తల్లి ఇందిరా దేవిని గుర్తుచేసుకుని హీరో మహేశ్‌బాబు చాలా ఎమోషనల్ అయ్యారు. ఇవాళ ఆమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘అమ్మా.. మాటల్లో చెప్పలేనంతగా నిన్ను మిస్ అవుతున్నా. హ్యాపీ బర్త్‌డే’ అని అమ్మతో కలిసి ఉన్న ఫొటోను పంచుకున్నారు. కాగా 2022లో ఇందిరా దేవి చనిపోయిన సంగతి తెలిసిందే.