News January 27, 2025
మేడ్చల్: రైతు భరోసా కోసం 378 దరఖాస్తులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన గ్రామ, వార్డు సభల్లో రైతు భరోసా పథకానికి సంబంధించి రైతుల నుంచి తీసుకున్న దరఖాస్తుల రిపోర్టును అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 378 మంది రైతులు రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. రైతుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం, ప్రభుత్వానికి ఈ వివరాలను పంపనున్నారు.
Similar News
News November 1, 2025
జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో గర్రెపల్లి సత్తా

రెండ్రోజులుగా పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి స్పోర్ట్స్ మీట్ లో సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి క్రీడాకారులు సత్తా చాటారు. షటిల్ విభాగంలో గర్రెపల్లి నుంచి పలు జట్లు పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచాయి. నిర్వాహకులు క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. కాగా, జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలను కైవసం చేసుకున్న క్రీడాకారులను గర్రెపల్లి గ్రామస్తులు అభినందించారు.
News November 1, 2025
హోంమంత్రి పనితీరును ప్రశంసించిన సీఎం

హోంమంత్రి వంగలపూడి అనిత పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. మొంథా తుఫాన్లో మంత్రి ప్రజలకు రక్షణ సహాయక చర్యల్లో పాల్గొని సేవలందించారన్నారు. ఈ మేరకు శనివారం ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో హోంమంత్రికి ప్రశంసాపత్రం, ఉత్తమ సేవా అవార్డును సీఎం అందజేశారు. ప్రజాసేవలో సీఎం చంద్రబాబు చూపిన మార్గం తమకు ఆదర్శం అని హోంమంత్రి అన్నారు.
News November 1, 2025
బంగారం డీల్.. రూ.25 లక్షలతో పరార్..!

తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మించి రూ.25 లక్షలు కాజేసిన ఘటన నరసరావుపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. నరసరావుపేటకు చెందిన గణేష్కు శుక్రవారం కేటుగాళ్లు తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మబలికారు. బంగారం డీల్ గురించి మాట్లాడుదామని కోటప్పకొండ వద్దకు రావాలని కోరారు.రూ.25 లక్షల నగదు తీసుకుని పరారయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


