News March 24, 2025
మేడ్చల్: శక్తి అభియాన్ డిస్టిక్ లెవెల్ క్యాంప్

మేడ్చల్లో శక్తి అభియాన్ డిస్టిక్ లెవెల్ క్యాంపును జోనల్ ఇన్ఛార్జి విజయ ఆధ్వర్యంలో నిర్వహించారు. లోక్సభ కోఆర్డినేటర్ రమణి, క్లబ్ సభ్యులు పాల్గొనగా.. ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ నాయకురాలు నీలిమ పాల్గొని మహిళల సాధికారత లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని మహిళలకు చేరవేయడమే తమ లక్ష్యం అని చెప్పుకొచ్చారు.
Similar News
News November 20, 2025
ధాన్యం ఆఖరి గింజ వరకూ కొంటాం: మంత్రి నాదెండ్ల

జిల్లాలోనే తొలిగా కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్ర గురువారం ప్రారంభమైంది. రైతు సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియాతో పాటు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులతో ఆయన మాట్లాడారు. రైతులు ధైర్యంగా ఉండాలని మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు.
News November 20, 2025
HYD: రాజకీయాల్లో దిక్సూచి చుక్కా రామయ్య: KTR

చుక్కా రామయ్య 100వ జన్మదినం సందర్భంగా విద్యానగర్లోని ఆయన నివాసానికి మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. ఆయనను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. KTR మాట్లాడుతూ.. విద్యా ప్రదాత, తెలంగాణ పోరాటం, రాజకీయాల్లో దిక్సూచిగా చుక్కా రామయ్య తనదైన పాత్ర పోషించారన్నారు. కార్యక్రమంలో BRS ఎమ్మెల్యేలు ఉన్నారు.
News November 20, 2025
ఆరేళ్ల వయసుకే NGO స్థాపించి..

మణిపూర్కు చెందిన లిసిప్రియా కంగుజాం 2011లో జన్మించింది. ఆరేళ్ళ వయసులో చైల్డ్ మూవ్మెంట్ అనే సంస్థను స్థాపించి, క్లైమేట్ చేంజ్పై పోరాటం మొదలుపెట్టింది. లిసిప్రియా 2019లో యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో మాట్లాడి అందర్నీ ఆకర్షించింది. ఆమె పోరాటానికి గుర్తింపుగా 2019లో డాక్టర్ APJ అబ్దుల్ కలాం చిల్డ్రన్స్ అవార్డ్, 2020లో గ్లోబల్ చైల్డ్ ప్రొడిజీ అవార్డ్లు అందుకుంది.


