News February 1, 2025
మేడ్చల్: సరైన సంఖ్యలో రైళ్లు లేక తప్పని తిప్పలు!

మేడ్చల్ రైల్వే స్టేషన్ ప్రాంతానికి సరైన సంఖ్యలో రైళ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు MMTS రైళ్లను సైతం సర్దుబాటు చేయాలని, మేడ్చల్ ప్రాంతం నుంచి సిటీ లోపలికి వెళ్లే వారికి సైతం MMTS సేవలు మరింత మెరుగ్గా అదే విధంగా తగిన చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. గతంలో ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
SRCL: ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు

జిల్లాలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపునకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో ధాన్యం సేకరణ, సేకరించిన ధాన్యం మిల్లులకు తరలింపు, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా సమీకృత కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఉన్నారు.
News November 18, 2025
పుట్టపర్తికి సచిన్ టెండూల్కర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఇవాళ పుట్టపర్తికి చేరుకున్నారు. సచిన్ టెండూల్కర్‌ను మంత్రులు లోకేశ్, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. కొంతసేపు వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
News November 18, 2025
శ్రీకాకుళం: స్టాప్ మీటింగ్‌లో కుప్ప కూలిన అధ్యాపకుడు

శ్రీకాకుళం ప్రభుత్వ బాలుర కళాశాల తెలుగు అధ్యాపకుడు పప్పల వెంకటరమణ మంగళవారం కళాశాలలో స్టాప్ మీటింగ్ జరుగుతుండగా కుప్ప కూలిపోయాడు. మీటింగ్‌లో ఒక్కసారిగా కింద పడిపోవటంతో స్పందించిన తోటి అధ్యాపకులు శ్రీకాకుళంలోని డే అండ్ నైట్ సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంకటరమణ పొందూరు మండలం ధర్మపురం కాగా, శ్రీకాకుళంలోని PM కాలనీలో నివాసం ఉంటున్నారు.


