News February 4, 2025
మేడ్చల్: స్కూల్ గేట్ బంద్.. గోడలు దూకిన స్టూడెంట్స్

స్కూల్ గేట్లు సమయానుసారంగా తెరవకపోవడంతో విద్యార్థులు గోడలు దూకుతున్నారు. మేడ్చల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి దాపురించింది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకున్నప్పటికీ గేట్లు తెరవలేదు. కొందరు పిల్లలు గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలను తల్లిదండ్రులు ఫొటోలు తీశారు. కిందపడితే ఎవరు బాధ్యులు అని.. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News October 14, 2025
KNR: మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కార్యక్రమం

‘నషా ముక్త్ భారత్ అభియాన్’ కార్యక్రమం ప్రారంభించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లాలోని అన్ని విద్యా సంస్థల్లో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో అధికారులు సమావేశం నిర్వహించి మార్గదర్శకాలు చర్చించారు.
News October 14, 2025
డీసీసీ ఎన్నికల పరిశీలకుడిని కలిసిన KNR కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడి ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ అబ్జర్వర్‌గా వచ్చిన కర్ణాటక హంగల్ ఎమ్మెల్యే మనే శ్రీనివాస్‌ను సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. డీసీసీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారు చర్చించినట్లు సమాచారం.
News October 14, 2025
ప్రశాంత వాతావరణంలో దీపావళి జరుపుకోండి: కలెక్టర్

దీపావళి పండుగ శాంతియుతంగా జరగాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా IAS సూచించారు. పండుగ సందర్భంగా పోలీసు, అగ్నిమాపక, విద్యుత్, ఆరోగ్య, మున్సిపల్ శాఖలతో పాటు టపాకాయల విక్రయదారులతో సమన్వయ మంగళవారం సమావేశం నిర్వహించారు. ప్రజలు భద్రతా నియమాలను పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అధికారులు పాల్గొన్నారు.