News February 4, 2025
మేడ్చల్: స్కూల్ గేట్ బంద్.. గోడలు దూకిన స్టూడెంట్స్

స్కూల్ గేట్లు సమయానుసారంగా తెరవకపోవడంతో విద్యార్థులు గోడలు దూకుతున్నారు. మేడ్చల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి దాపురించింది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకున్నప్పటికీ గేట్లు తెరవలేదు. కొందరు పిల్లలు గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలను తల్లిదండ్రులు ఫొటోలు తీశారు. కిందపడితే ఎవరు బాధ్యులు అని.. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు
Similar News
News February 11, 2025
HYD: మృతుల కుటుంబాలకు మంత్రి సానుభూతి

మధ్యప్రదేశ్ జబల్‌పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు హైదరాబాద్ వాసులు మృతిచెందడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశామన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధితులను అక్కడి ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని, సహాయక చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
News February 11, 2025
HYD: కన్నీటి ఘటన.. మృతులు వీరే..!

ప్రయాగ్ రాజ్ వెళ్లి వస్తుండగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదం నింపింది.ఘటనలో HYD నాచారం కార్తికేయ నగర్ ప్రాంతానికి చెందిన 1.శశికాంత్(38),2.మల్లారెడ్డి (60), 3.రవి రాంపల్లి (56), 4.రాజు నాచారం ఎర్రకుంట, 5.సంతోష్ (47), 6.ఆనంద్ రెడ్డి ముసారంబాగ్,7.టీవీ ప్రసాద్ నాచారం గోకుల్ నగర్ మృత్యువాత పడ్డారు.కాగా.. ప్రమాద ఘటనలో 8.నవీన్ చారి,9.బాలకృష్ణకు స్వల్ప గాయాల పాలై ప్రాణాలతో బయటపడ్డారు.
News February 11, 2025
షాద్‌నగర్: రైలు ఢీకొని వ్యక్తి మృతి

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది. షాద్‌నగర్ పట్టణానికి చెందిన గౌస్ పాషా (45) తండ్రి షేక్ ఖాసిం భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్టేషన్ మాస్టర్ రాహుల్ కుమార్ ఫిర్యాదుతో రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.