News February 4, 2025
మేడ్చల్: స్కూల్ గేట్ బంద్.. గోడలు దూకిన స్టూడెంట్స్

స్కూల్ గేట్లు సమయానుసారంగా తెరవకపోవడంతో విద్యార్థులు గోడలు దూకుతున్నారు. మేడ్చల్‌లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ పరిస్థితి దాపురించింది. విద్యార్థులు పాఠశాల సమయానికి చేరుకున్నప్పటికీ గేట్లు తెరవలేదు. కొందరు పిల్లలు గోడలు దూకి మరీ లోపలికి వెళ్లారు. ఈ దృశ్యాలను తల్లిదండ్రులు ఫొటోలు తీశారు. కిందపడితే ఎవరు బాధ్యులు అని.. దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 8, 2025
వరంగల్: ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి: కలెక్టర్

కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య అధికారులతో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద సమీక్ష నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. వేసవిలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, ప్రజలను అనారోగ్య సమస్యల నుంచి రక్షించాలని వైద్యశాఖ అధికారులను సూచించారు.
News February 8, 2025
అమలాపురం: బీ ఫారం అందుకున్న ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్

ఉభయ గోదావరి జిల్లాల ఎన్డీఏ కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ శనివారం బీ ఫారం అందుకున్నారు. అమరావతిలోని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పళ్ల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ బీఫారం అందజేశారు. కార్యక్రమంలో కేంద్ర సాంకేతిక సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు పార్టీ నేతలు కార్యక్రమాలు పాల్గొన్నారు.
News February 8, 2025
ఢిల్లీలో బీజేపీ గెలుపు చరిత్రాత్మకం: చంద్రబాబు

AP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. మోదీపై నమ్మకంతోనే ఢిల్లీ ప్రజలు బీజేపీని గెలిపించారని చెప్పారు. ‘ఢిల్లీలో రాజకీయ, వాయుకాలుష్యాన్ని ఆప్ సర్కార్ పట్టించుకోలేదు. చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఈ సమస్య నుంచి బీజేపీ గట్టెక్కిస్తుందని ప్రజలు నమ్మారు. భారత్‌కు సరైన సమయంలో వచ్చిన సరైన నాయకుడు మోదీ’ అని ఆయన పేర్కొన్నారు.