News December 1, 2024
మేడ్చల్: స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న త్రిపుర గవర్నర్

మేడ్చల్‌లోని ధ్రువ కాలేజ్ ఆఫ్ మేనేజ్మెంట్ 28వ స్నాతకోత్సవ వేడుకలకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు జ్యోతి ప్రజ్వలన చేపట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉన్నత విద్యలో మెరుగ్గా రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులను అభినందించి డిగ్రీ పట్టాలు అందజేశారు.
Similar News
News January 20, 2026
RR: బ్యాటరీ వీల్ చైర్లు, ల్యాప్‌టాప్స్‌కు అప్లై చేసుకోండి

PWDs సాధికారత, లబ్ధికోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా మహిళలు, శిశువులు, దివ్యాంగులు & వృద్ధుల సంక్షేమ అధికారి శ్రీలత తెలిపారు. దివ్యాంగులకు బ్యాటరీ వీల్ చైర్లు, ట్రై సైకిల్స్, డిగ్రీ విద్యార్థులకు ల్యాప్‌టాప్స్, ట్యాబ్స్ మొదలైన సహాయ ఉపకరణాలను అందిస్తామన్నారు. జనవరి 21 నుంచి జనవరి 30వ తేదీలోపు OBMMS పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకోవాలని సూచించారు.
News January 20, 2026
HYDలో ఫేక్ ట్రాఫిక్ చలాన్ల కలకలం: జాగ్రత్త!

HYDలో నకిలీ ట్రాఫిక్ చలాన్ల మోసాలు పెరుగుతుండటంపై పోలీసులు ప్రజలను హెచ్చరించారు. అధికారిక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫిషింగ్ లింక్‌లను నిందితులు SMS ద్వారా పంపుతున్నారు. ఆ లింక్‌లను క్లిక్ చేసి వివరాలు నమోదు చేయగానే బాధితుల బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ప్రభుత్వ సైట్లు ఎల్లప్పుడూ .gov.in లేదా .orgతో ముగుస్తాయని, SMS లింక్‌ల ద్వారా చెల్లింపులు చేయొద్దని అధికారులు సూచించారు.
News January 19, 2026
RR: సర్పంచ్‌లకు ముచ్చింతల్‌లో శిక్షణ

కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 27 వరకు 5 విడతల్లో రంగారెడ్డి జిల్లాలోని 525 మంది సర్పంచులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వనుంది. సభ్యులకు గ్రామ పంచాయతీల పాలన, తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టంపై అవగాహన కల్పించనున్నారు. ఇందుకోసం శంషాబాద్ మండలం ముచ్చింతల్ స్వర్ణభారతి ట్రస్టులోని 2 సమావేశ మందిరాలను సిద్ధం చేశారు.


