News February 16, 2025

మేడ్చల్: హడలెత్తిస్తున్న వరుస హత్యలు

image

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస హత్యలు స్థానికులను హడలెత్తిస్తున్నాయి. నెలరోజుల వ్యవధిలోనే మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు హత్యలు జరిగాయి. నేడు పట్టపగలు మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై గూగులోత్ ఉమేశ్ (23)ను వెంబడించి మరీ అతని తమ్ముడు రాకేశ్ మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

Similar News

News October 28, 2025

IRCTCలో 45 పోస్టులు.. అప్లైకి కొన్ని గంటలే ఛాన్స్

image

IRCTC 45 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 15 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.9,600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com/

News October 28, 2025

చైతన్యం వస్తుందా? గంజాయిపై యుద్ధమే శరణ్యం

image

భద్రాద్రి: గంజాయి అనర్థాలపై పోలీసులు పదేపదే అవగాహన కల్పిస్తున్నా, జిల్లాలో అక్రమ రవాణా కొనసాగుతుండటం ఆందోళనకరం. ఎస్పీ పిలుపుతో ‘చైతన్యం-డ్రగ్స్‌పై యుద్ధం’ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం అభినందనీయమే కానీ, ప్రచారం కన్నా, నిరంతర పర్యవేక్షణ, కఠిన శిక్షలు, విద్యార్థుల్లో లోతైన మానసిక పరివర్తన తీసుకురాగలిగితేనే యువతలో శాశ్వత చైతన్యం వచ్చి, జిల్లా ‘డ్రగ్స్‌ రహితం’గా మారుతుంది.

News October 28, 2025

కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

image

ప్రైవేట్ సంస్థలు ప్రభుత్వ స్థలాల్లో మీటింగ్స్ పెట్టుకోవడానికి ముందు పర్మిషన్ తీసుకోవాలంటూ కర్ణాటక ప్రభుత్వమిచ్చిన ఆర్డర్స్‌పై ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది ప్రాథమిక హక్కులకు విరుద్ధమని, దీని వల్ల పది మంది పార్కులో పార్టీ చేసుకున్నా నేరమే అవుతుందని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. కోర్టు విచారణను NOV 17కు వాయిదా వేసింది. కాగా RSSను కట్టడి చేసేందుకే ప్రభుత్వం ఈ ఆర్డరిచ్చిందని విమర్శలొచ్చాయి.