News January 26, 2025
మేడ్చల్: 34,719 రేషన్ కార్డులకు సభల్లో ఆమోదం!

మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో ప్రత్యేక గ్రామ, వార్డు సభలు ఇటీవల నిర్వహించిన అనంతరం తాజాగా రిపోర్టు వెల్లడైంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు చేసుకున్న 34,719 మంది వివరాలను గ్రామ, వార్డు సభల్లో ఉంచారు. అనంతరం ఆమోదం సైతం తీసుకున్నట్లుగా అధికారులు తెలిపారు. మరోవైపు అదే సభల్లో మరి కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News October 18, 2025
వైసీపీ జిల్లా అధ్యక్షురాలిగా అనంతలక్ష్మి

వైసీపీ కాకినాడ జిల్లా అధ్యక్షురాలిగా పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన ఏలేటి అనంతలక్ష్మి ఎంపికయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా అనంతలక్ష్మి అన్నారు.
News October 18, 2025
భూపాలపల్లి: మద్యం షాపులకు టార్గెట్ రీచ్ అయ్యేనా..!

భూపాలపల్లి జిల్లాలో మద్యం దుకాణాలకు టెండర్లు నేటితో పూర్తి కానుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల పరిధిలో 59 మద్యం దుకాణాలకు గత నెల 26 నుంచి టెండర్లు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 525 మంది నుంచి దరఖాస్తులు అందాయి. దీంతో ప్రభుత్వానికి రూ.15.27 కోట్ల ఆదాయం వచ్చింది. గతంలో 59 షాపులకు 2,161 దరఖాస్తుల రాగా, 43.22 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. ప్రస్తుతం వ్యాపారులందరూ సిండికేట్లుగా మారారు.
News October 18, 2025
కొత్తగూడెం నుంచి ప్రత్యేక పంచారామ సర్వీసులు

కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల కోసం కొత్తగూడెం ఆర్టీసీ విభాగం ప్రత్యేక సర్వీసులు ప్రకటించింది. కొత్తగూడెం, పాల్వంచ నుంచి పంచారామాలు (అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట) వరకు సూపర్ లగ్జరీ బస్సు నడిపిస్తున్నామన్నారు. ఈ నెల 26న రాత్రి 9 గంటలకు బస్సు బయలుదేరుతుందన్నారు. అన్నవరంకు కూడా డీలక్స్ సర్వీసు అందుబాటులో ఉంది.