News March 27, 2025

మేయర్ కలిసిన ఇండియానాలో పోలో బృందం

image

అమెరికాకు చెందిన ఇండియానాలో పోలో బృందం మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో భేటీ అయ్యింది. 2010లో ఇండియనా స్టేట్ పలు అంశాలపై సిస్టర్ సిటీ ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో మేయర్ ఆ బృందాన్ని సాదరంగా ఆహ్వానించి ధన్యవాదాలు తెలిపారు. సిస్టర్ సిటీ ఒప్పందంలో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఇండియనా ప్రతినిధులు మేయర్‌కు వివరించారు.

Similar News

News December 23, 2025

ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు.. క్లారిటీ

image

TG: ఉప సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దుపై కొంత గందరగోళం నెలకొంది. కొత్తగా ఏర్పడిన పంచాయతీలు, మండలాలు 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రత్యేక అకౌంట్ ఓపెన్ చేయాలని తెలంగాణ ప్రభుత్వం మెమో ఇచ్చింది. పంచాయతీ కార్యదర్శి/MPDO, సర్పంచ్/MPP డిజిటల్ సంతకాలతో పేమెంట్స్ జరుగుతాయని పేర్కొంది. అయితే అధికారుల, మీడియా గ్రూపుల్లో ఇది ఉపసర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దుగా ప్రచారమైంది. వాస్తవానికి ఉపసర్పంచ్ చెక్ పవర్ తొలగించలేదు.

News December 23, 2025

నంద్యాల గెలుపు.. ఆర్థిక సంస్కరణల పితామహుడిగా గుర్తింపు

image

దేశానికి ఒక ప్రధానిని, ఒక రాష్ట్రపతిని అందించిన అరుదైన ఘనత నంద్యాల నియోజకవర్గానికి ఉంది. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా మంగళవారం నంద్యాల వాసులు ఆయన సేవలను ఘనంగా స్మరించుకున్నారు. 1991లో నంద్యాల నుంచి ఎంపీగా గెలిచిన పీవీ, ఆ తర్వాత ప్రధానమంత్రిగా దేశ ఆర్థిక గమనాన్ని మార్చిన ‘ఆర్థిక సంస్కరణల పితామహుడి’గా నిలిచిపోయారు.

News December 23, 2025

చరిత్రలో బ్రహ్మోత్సవాల పరంపర ఏంటి..?

image

తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్ర పురాతనమైనది. లోకకళ్యాణం కోసం బ్రహ్మ ఈ ఉత్సవాలను ప్రారంభించాడట. అందుకే వీటిని ‘బ్రహ్మోత్సవాలు’ అంటారు. చారిత్రకంగా పల్లవ, చోళ, విజయనగర చక్రవర్తులు ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేవారు. ఒకప్పుడు భక్తుల రద్దీని బట్టి ఏటా 12 సార్లు కూడా బ్రహ్మోత్సవాలు జరిగేవని చెబుతారు. కాలక్రమేణా అవి తగ్గి, ప్రస్తుతం మనం చూస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాలుగా స్థిరపడ్డాయి. <<-se>>#VINAROBHAGYAMU<<>>