News May 11, 2024
మే 13న ఎన్నికలు.. తరలివస్తున్న ఓటర్లు

మే 13న జరిగే ఎన్నికల నేపథ్యంలో దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు తమ స్వస్థలాలకు చేరుకొంటున్నారు. ఉద్యోగ, వ్యాపారరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు ఉత్సాహంగా తమ ఊర్లకి తరలివస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి వచ్చే వారు అధికంగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చే బస్సు సర్వీసులన్ని కిటకిటలాడుతున్నాయి. దీంతో అధికారులు అదనంగా 225 బస్సులను నడుపుతున్నారు.
Similar News
News February 16, 2025
కంకిపాడు: వాకింగ్‌కి వెళ్లిన వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కంకిపాడు మండలం ప్రొద్దుటూరు శివారు కొనతనపాడులో ఉంటున్న వెంకటస్వామి ఈనెల 14న రాత్రి వాకింగ్‌కి వెళ్లి తిరిగి రాకపోవడంతో భార్య కొందరితో కలిసి సాయంత్రం వెతకగా రోడ్డు పక్కన చనిపోయి కనిపించాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 16, 2025
MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం : DRO

పట్టభద్రుల MLC ఎన్నికల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్రే కీలకం అని కృష్ణాజిల్లా సహాయ ఎన్నికల అధికారి, DRO కె చంద్రశేఖరరావు అన్నారు. సూక్ష్మ పరిశీలకులుగా నియమితులైన వారికి శనివారం కలెక్టరేట్‌లో వారి విధులపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను, నిబంధనలను పూర్తిగా చదివి అర్థం చేసుకోవాలన్నారు.
News February 15, 2025
పెనమలూరు: ఆన్‌లైన్‌లో రూ.1.55 లక్షల స్వాహా

సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ ఉపాధ్యాయుడు మోసపోయిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న కానూరుకి చెందిన రమణమూర్తి అతని ఫోన్లో ఉన్న టెలిగ్రామ్ యాప్‌కు`Global India Private Limited’ పేరుతో అధిక లాభాలు వస్తాయని మెసేజ్ వచ్చింది. దీంతో ఆయన రూ.1.55 లక్షలు జమ చేశారు. తర్వాత వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.