News May 11, 2024

మే 14న వారికి సెలవు

image

TG: మే 13న ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి మరుసటి రోజు సెలవు ప్రకటిస్తున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సిబ్బందికి మే 14న స్పెషల్ క్యాజువల్ లీవ్ లేదా పెయిడ్ హాలిడేగా గుర్తించాలని సీఈసీ వికాస్ రాజ్ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించారు.

Similar News

News February 7, 2025

సీఎం రేవంత్‌పై WEF ప్రశంసల జల్లు

image

TG: CM రేవంత్ రెడ్డిపై వరల్డ్ ఎకనమిక్ ఫోరం(WEF) ప్రశంసలు కురిపించింది. తెలంగాణ ఆర్థిక అభివృద్ధి విషయంలో ఆయన దార్శనికత అద్భుతమని పేర్కొంటూ ఓ లేఖ రాసింది. ‘రాష్ట్ర అభివృద్ధికోసం మీ ప్రణాళికలు బాగున్నాయి. దావోస్ సదస్సులో మీరు కీలక భాగస్వామిగా వ్యవహరించారు. రైజింగ్ తెలంగాణ 2050 నినాదం ప్రత్యేకంగా నిలిచింది. 2047 కల్లా హైదరాబాద్‌ను కాలుష్యంలో నెట్ జీరో చేయాలన్న మీ సంకల్పం ప్రశంసనీయం’ అని కొనియాడింది.

News February 7, 2025

మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ: శోభిత

image

‘తండేల్’ రిలీజ్ సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభిత మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు. ఈ సినిమాపై చైతూ చాలా దృష్టి సారించారని, చేస్తున్నన్ని రోజులు పాజిటివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అంటూ చైతూను ఉద్దేశిస్తూ ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ కోసం చాలా రోజులుగా ఆయన గడ్డం లుక్‌లోనే ఉన్నారు. గత ఏడాది dec 4న వీరి వివాహమైన సంగతి తెలిసిందే.

News February 7, 2025

జనసేనకు సూపర్ న్యూస్.. తెలంగాణలోనూ పార్టీకి గుర్తింపు

image

జనసేన పార్టీకి ఈసీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే ఏపీలో <<15218607>>ప్రాంతీయ పార్టీగా<<>> గుర్తింపు పొందగా తెలంగాణలోనూ గుర్తింపునిస్తూ SEC ఉత్తర్వులిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును కేటాయించింది. 2024లో ఏపీలో 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు జనసేన గెలిచిన విషయం తెలిసిందే. దీంతో రిజిస్టర్డ్ పార్టీ హోదా నుంచి గుర్తింపు పొందిన పార్టీగా మారింది. ఇకపై గాజు గ్లాసు చిహ్నాన్ని ఎవరికీ కేటాయించరు.

error: Content is protected !!