News April 29, 2024
మే 2న జిల్లాకు రానున్న చంద్రబాబు, లోకేశ్

ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వచ్చే నెల 2న రాయచోటి, కడపకు రానున్నారు. మధ్యాహ్నం రాయచోటిలో జరిగే బహిరంగసభలో పాల్గొననున్న చంద్రబాబు సాయంత్రం కడప నగరానికి చేరుకుని రోడ్ షోలో పాల్గొని ప్రజాగళం బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ రానున్నారు. యువతతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
Similar News
News April 15, 2026
కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు ఇలా.!

కడప జిల్లాలో ఇంటర్ ఒకేషనల్ పరీక్షలు 2,382 మంది విద్యార్థులు రాశారు. వీరిలో 1,080 మంది పాస్ అయ్యారు.
1st ఇయర్ 592 మంది బాలురు రాయగా.. 285(31%) పాస్ అయ్యారు. 664 మంది బాలికల్లో 278(42%) పాస్ అయ్యారు. 2nd ఇయర్ బాలురు 473 మందిలో 231(49%) పాస్ అయ్యారు. బాలికలు 657 మందిలో 386(58%) పాస్ అయ్యారు. ఒకేషనల్ ఉత్తీర్ణతలో బాలుర కన్నా బాలికలే ముందంజలో ఉన్నారు.
News April 15, 2026
కడప జిల్లాలో గత ఆరు సంవత్సరాల ఇంటర్ ఫలితాలు ఇలా.!

☛ 2021 అకడమిక్ ఇయర్‌లో కరోనా కారణంగా 100 శాతం విద్యార్థుల ఉత్తీర్ణత
☛ 2022లో ఇంటర్ ఫస్టియర్ 41 శాతం.. సెకండియర్ 50 శాతం ఉత్తీర్ణత
☛ 2023లో ఫస్టియర్ 46 శాతం, సెకండియర్ 60 శాతం ఉత్తీర్ణత
☛ 2024లో ఫస్టియర్ 55 శాతం, సెకండియర్ 69 శాతం ఉత్తీర్ణత
☛ 2025లో ఫస్టియర్ 61 శాతం, సెకండియర్ 75 శాతం ఉత్తీర్ణత
☛ 2026లో ఫస్టియర్ 66 శాతం, సెకండియర్ 71 శాతం ఉత్తీర్ణత.
News April 15, 2026
పోరుమామిళ్ల: ఇంటర్‌లో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పోరుమామిళ్ల మండలానికి చెందిన విద్యార్థి ఇంటర్‌లో ఫెయిల్ అవడంతో మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి పోరుమామిళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో కడప రిమ్స్‌కు రిఫర్ చేశారు. డాక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థి తాగిన పాయిజన్ అత్యంత ప్రమాదకరమని, పరిస్థితి తీవ్రంగా ఉందని తెలిపారు.


