News March 29, 2025

మే 23 నుంచి వారం పాటు 30 రైళ్లు రద్దు

image

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్‌లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నందున మే 23 నుంచి 29 వరకు సుమారు 30 రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వీటితో పాటు మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా, 11 రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు CPRO శ్రీధర్ తెలిపారు. అలాగే 35 రైళ్లకు ఆయా తేదీల్లో మహబూబాబాద్ స్టేషన్లో స్టాపేజీని ఎత్తివేశామని వెల్లడించారు.

Similar News

News October 29, 2025

జగిత్యాల: వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ ప్రభావంతో అక్టోబర్ 29, 30న జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. ప్రజలు కల్వర్టులు దాటకూడదని, నీటి వనరుల సమీపంలో ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.

News October 29, 2025

ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలకు తావు లేదు: కలెక్టర్

image

అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష హెచ్చరించారు. కమాన్‌పూర్ మండలం రొంపికుంట గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎం.తిరుపతిని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసినందుకు విధుల నుంచి తొలగించారు. ప్రభుత్వ పథకాల అమలులో అవినీతి సహించబోదని, మరెవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News October 29, 2025

పాలకీడులో అత్యధిక వర్షపాతం

image

తుపాను ప్రభావంతో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సూర్యాపేట జిల్లాలోని పాలకీడు మండలంలో అత్యధికంగా 80.8 మి.మీ వర్షపాతం నమోదైంది. మఠంపల్లి మండలంలో 68.5 మి.మీ, మేళ్లచెరువులో 59, కోదాడలో 41.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.