News April 21, 2024
మే 26 నుంచి అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ పరీక్షలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ ప్రధమ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు మే 26 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లెర్నింగ్ సపోర్ట్ సెంటర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ కో-ఆర్డినేటర్ డా.సుంకరి రాజారామ్ తెలిపారు. ప్రధమ సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఫీజు మే 6 వరకు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు 7382929758, 9553568049 నంబర్లను సంప్రదించాలన్నారు.
Similar News
News December 25, 2024
NLG: ఎవరు ‘నామినేట్’ అవుతారు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో నామినేటెడ్ పోస్టుల కోసం నాయకులు తహతహలాడుతున్నారు. పలు కార్పొరేషన్ల ఛైర్మన్‌ల పోస్టులను ప్రభుత్వం ఇప్పటికే భర్తీ చేసింది. కాగా జిల్లాస్థాయి హోదాలైన గ్రంథాలయ సంస్థ, వైడీటీఏ, పలు కార్పొరేషన్ల పదవులు ఆశిస్తున్నారు. దీనికోసం అగ్ర నేతలను తరచూ కలుస్తూ చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం పనిచేశామని, తమకే పదవి కట్టబెట్టాలని పట్టుబడుతున్నారు.
News December 25, 2024
భువనగిరి: అంగన్‌వాడీ టీచర్ల సస్పెండ్
చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో BNGR కలెక్టర్ హనుమంతరావు అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. భువనగిరిలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రం 3, మంతపురి, పుట్టగూడెం, మోత్కూర్ 7వ కేంద్రం అంగన్‌వాడీ టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News December 25, 2024
క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
రేపు క్రిస్మస్ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచానికి ప్రేమ, సేవా, కరుణ, త్యాగం, క్షమాగుణం వంటి అద్భుతమైన జీవన మార్గాలను అందించిన జీసస్ స్పూర్తిని కొనసాగించేందుకు మనమంతా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించుకుందామని మంత్రి పిలిపునిచ్చారు. ఏసుక్రీస్తు దయతో తెలంగాణలో ప్రజలంతా పాడిపంటలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు.