News April 8, 2025

మే 31లోపు ప్రణాళికలు సిద్ధం చేయండి: చిత్తూరు కలెక్టర్ 

image

మే 31లోపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌లో భాగంగా స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని  కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశమైయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యానవన, నైపుణ్య అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై సచివాలయ మండల నియోజకవర్గ స్థాయి అధికారులు డాక్యుమెంట్ తయారు చేసి జిల్లా యంత్రాంగానికి పంపాలన్నారు.

Similar News

News November 30, 2025

చిత్తూరు: సిబ్బంది అందుబాటులో ఉండాలి

image

తుఫాను నేపథ్యంలో సిబ్బంది అందరూ ప్రధాన కేంద్రాలలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. ఆదివారం సాయంత్రం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు. 14 మండలాలలో 168 గ్రామాలలో తుఫాను ప్రభావం ఉండే అవకాశం ఉందన్నారు. ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

News November 30, 2025

ముత్తుకూరు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్ద పంజాణి మండలం ముత్తుకూరు క్రాస్ వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ముత్తుకూరు నుంచి బైక్‌పై వస్తున్న అంజి అనే వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 30, 2025

రూ.250 కోట్ల ఆదాయం.. బాలాజీ డివిజన్ ఇంకెప్పుడు.?

image

IND రైల్వేకు ఏటా రూ.250 కోట్ల ఆదాయానిచ్చే తిరుపతి RS <<18428153>>ప్రత్యేక డివిజన్<<>> ఏర్పాటుకు ఆమడ దూరంలో ఉంది. ఈ స్టేషన్ గుంతకల్‌ డివిజన్‌‌కు 320, విశాఖ జోన్‌‌కు 736 కి.మీ దూరంలో ఉంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులతో 1990 నుంచి బాలాజీ రైల్వే డివిజన్‌ డిమాండ్‌ ఊపదుకుంది. డివిజన్‌ లేకపోవడంతో TPT–తిరుచానూరు–చంద్రగిరి కారిడార్ అభివృద్ధి, గూడూరు డబుల్‌లైన్‌, కాట్పాడి ఎలక్ట్రిఫికేషన్‌ వంటి ప్రాజెక్టులు నెమ్మదించాయట.