News August 30, 2024

మైగ్రేషన్‌పై వచ్చిన విద్యార్థులను తిరిగి పంపిన నవోదయ

image

నిజాంసాగర్ మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఉత్తరప్రదేశ్‌లోని మధుర నవోదయ విద్యాలయం నుంచి తొమ్మిదో తరగతి చదివేందుకు వచ్చిన మైగ్రేషన్ విద్యార్థులను తిరిగి మధురకు పంపించారు. వాతావరణం భాష సహకరించక పోవడంతో ఏడుగురు బాలికలను, 15 మంది బాలురు లను తిరిగి మధుర నవోదయ విద్యాలయానికి పంపుతున్నట్లు ప్రిన్సిపల్ సత్యవతి తెలిపారు. ఇక్కడ విద్యార్థులు అక్కడికి అక్కడ విద్యార్థులు ఎక్కడికి వెళ్లడం సహజమన్నారు.

Similar News

News September 14, 2024

రిజర్వాయర్ గేట్ల వద్ద చేపలు పడుతూ యువకుల కాలక్షేపం

image

ఎడపల్లి మండలంలోని అలీసాగర్ రిజర్వాయర్ గేట్ల వద్ద ఇటీవల భారీ వర్షాలతో అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను ఎత్తారు. దీంతో వరదనీటితో పాటు చేపలు దిగువ ప్రాంతానికి వచ్చాయి. ఈ క్రమంలో నిజామాబాద్ పట్టణానికి చెందిన పలువురు యువకులు పెద్దఎత్తున అలీసాగర్ గేట్ల దిగువన నిలిచిన వరదనీటితో చేపలు పట్టేందుకు ఇలా చుట్టూ ఉన్న గోడపై కూర్చొని కాలక్షేపం చేశారు.

News September 13, 2024

పిట్లం: తల్లి దండ్రులు మందలించారని సూసైడ్

image

తల్లి దండ్రులు మందలించారని మనస్తాపంతో కొడుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పిట్లం మండలం తిమ్మానగర్‌లో శుక్రవారం జరిగింది. ఎస్సై రాజు వివరాలిలా.. తిమ్మనగర్ వాసి బొమ్మల నాందేవ్ (23) పనిచేయకుండా ఇంటి వద్ద ఖాళీగా ఉంటున్నాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు మందలించగా.. గ్రామ శివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News September 13, 2024

NZB: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు: DEO

image

నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు శనివారం సెలవు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ తెలిపారు. సాధారణంగా రెండో శనివారం సెలవు దినమని కానీ, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ నెల 2వ తేదీన సెలవు ఇచ్చిన నేపథ్యంలో 14వ తేదీన రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.