News January 17, 2025

మైదుకూరులో సీఎం పర్యటన సాగేదిలా..!

image

సీఎం చంద్రబాబు ఈనెల 18న మైదుకూరులో పర్యటించనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు వస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మైదుకూరు కోర్టుకు చేరుకుంటారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అమలుపై ఆరా తీస్తారు. ఇందులో భాగంగా సీఎం ఇంటింటికీ తిరుగుతారు. తడి, పొడి చెత్త వేరు చేయడంపై ప్రజలకు ఏమేర అవగాహన ఉందో తెలుసుకుంటారు. దీంతో అధికారులు అప్రమత్తమై మైదుకూరులో స్వచ్ఛత పనులు చేస్తున్నారు.

Similar News

News February 14, 2025

కడపలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

image

కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.

News February 14, 2025

ఇవాళ కడపకు రానున్న YS జగన్

image

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడపకు రానున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి వివాహ వేడుకలకు జగన్ రానున్నారు. ఉదయం 10.40 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయం చేరుకుని రోడ్డు మార్గాన నగర శివారులోని మేడా ఫంక్షన్ హాల్‌కు వెళ్తారు. నూతన వధూవరులను ఆశీర్వదించి తిరిగి 11.30 గంటలకు కడప నుంచి బెంగళూరుకు బయల్దేరి వెళ్లనున్నారు.

News February 14, 2025

పులివెందుల : శ్రీ వెంకటరమణుడికి స్నపన తిరుమంజన సేవ

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

error: Content is protected !!