News May 26, 2024
మైదుకూరు: ‘ఎవరైనా గెలవండి.. మా సమస్య తీర్చండి’

మైదుకూరు మున్సిపాలిటీలో తాగునీటి సమస్య అధికంగా ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నామని, సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచినవారు మొట్టమొదటిగా తాగునీటి సమస్యను పరిష్కరించాలని శనివారం మున్సిపాలిటీ ప్రజలు ఓ ప్రకటనలో విన్నవించారు. మైదుకూరు నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులలో ఎవరు గెలిచినా నీటి సమస్యపై దృష్టి పెట్టి శాశ్వత పరిష్కారం చేయాలని ప్రజలు కోరారు.
Similar News
News February 8, 2025
జమ్మలమడుగు: ఆర్టీసీ బస్సులో వ్యక్తి మృతి

జమ్మలమడుగు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కడప జిల్లా మైలవరం మండలం వేపరాలకు చెందిన నాగయ్య(42) తాడిపత్రి నుంచి జమ్మలమడుగు వచ్చేందుకు బస్సు ఎక్కారు. కొలిమిగుండ్ల వద్ద గుండెపోటుకు గురైన ఆయన సీట్లో నుంచి కుప్పకూలి కింద పడ్డారు. అనంతరం ప్రయాణికులు పరిశీలించగా అప్పటికే మృతిచెందారు.
News February 8, 2025
కడప విమానాశ్రయ అభివృద్ధికి కార్యాచరణ

పర్యావరణానికి ఎలాంటి అంతరాయం లేకుండా, నిబంధనలకు లోబడి.. కడప విమానాశ్రయ అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఎయిర్ ఫీల్డ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కమిటీల సమావేశం జరిగింది. ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ విమానాశ్రయ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై కమిటీ చర్చించింది.
News February 8, 2025
కడప: వేసవిలో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి.!

వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి.. తాగునీటి కొరత లేకుండా ముందస్తు ప్రణాళికలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో వేసవిలో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి అవసరాల సన్నద్ధతపై సంబంధిత మున్సిపల్, ఇంజనీరింగ్ అధికారులతో శుక్రవారం సమీక్ష జరిపారు. పెండింగ్‌లో ఉన్న తాగునీటి సరఫరా పనులను పూర్తి చేయాలన్నారు.