News November 24, 2024
మైదుకూరు: బైకును ఢీకొన్న టిప్పర్.. ముగ్గురు మృతి
మైదుకూరు మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎద్దడుగు కనుమ వద్ద ఆదివారం సాయంత్రం బైకును టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో బైకులో వెళుతున్న ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు అక్కడికక్కడే మృతి చెందారు. మైదుకూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 5, 2024
కడప ఎస్పీగా రాహుల్ మీనా?
కడప నూతన SPగా రాహుల్ మీనా వస్తున్నారనే కథనాలు జిల్లాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల YCP సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డి కేసులో SP హర్షవర్ధన్ రాజు అలసత్వం వహించాడని ఆయన్ను తప్పించారు. ఆ తర్వాత అన్నమయ్య జిల్లా SP విద్యాసాగర్ నాయుడును అదనపు SPగా ఉన్నతాధికారులు నియమించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గుంతకల్ రైల్వే SPగా పనిచేస్తున్న రాహుల్ మీనా వస్తారని సమాచారం. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
News December 5, 2024
గండికోట పర్యాటక అభివృద్ధికి అడుగులు: కలెక్టర్
ప్రపంచ పర్యాటక మ్యాపులు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న గండికోట పర్యాటక ప్రాంత అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండికోట పర్యాటక అభివృద్ధిపై బుధవారం సమీక్షించారు. జిల్లాలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాచుర్యం పొందిన పర్యాటక ప్రాంతమైన “గండికోట పర్యాటక కేంద్రం” భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక రంగాన్ని శాసిస్తుందన్నారు.
News December 4, 2024
కడప జిల్లాపై లేని భూప్రకంపనల ప్రభావం
తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపనలు రావడం సంచలనంగా మారింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఎక్కడ ప్రమాదాలు జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కాగా ఉమ్మడి కడప జిల్లాలో ఎటువంటి ప్రకంపనలు రాకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మన జిల్లాలో ఎక్కడైనా భూప్రకంపనల ప్రభావం ఉంటే కామెంట్ చేయండి.