News November 24, 2024
మైదుకూరు: మృతులంతా ఒకే కుటుంబీకులే

మైదుకూరు – పోరుమామిళ్ల ప్రధాన రహదారిలో టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. కాశినాయన మండలం చిన్నాయపల్లికి చెందిన గుర్రాల శ్రీనివాసరెడ్డి, ఆయన భార్య అరుణ, కుమార్తె పవిత్రలుగా గుర్తించారు. మైదుకూరు మండలం తిప్పాయపల్లె గ్రామంలో ఫంక్షన్కు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News November 19, 2025
సింహాద్రిపురం: అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య

సింహాద్రిపురం మండలంలోని బిందెనంచెర్ల చెందిన ముత్తులూరు పెద్దిరెడ్డి(47) అనే చీని అన్నదాత మంగళవారం చెరువుకట్ట వద్దకు వెళ్లి విష ద్రావణం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతుకు ఐదు ఎకరాల చీనీ తోట ఉంది. పంట సాగుకు, కుటుంబ అవసరాలకు రూ.20 లక్షలు అప్పులు చేశాడు. చీనీ కాయలకు ధరలు లేకపోవడంతో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News November 18, 2025
‘రాయలసీమ’ పేరుకు నేటికి 97 ఏళ్లు!

బ్రిటిష్ కాలంలో ‘దత్త మండలం’గా పిలవబడిన మన ప్రాంతానికి ‘రాయలసీమ’ అనే పేరు పెట్టి నేటికి 97ఏళ్లు పూర్తయ్యాయి. 1928 నవంబర్ 18న నంద్యాలలో జరిగిన ఆంధ్ర మహాసభలో చిలుకూరి నారాయణరావు ఈ పేరును ప్రతిపాదించారు. విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయలుకు ఈ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ ‘‘రాయలసీమ’’ అనే పేరును ప్రతిపాదించారు. పప్పూరు రామాచార్యులు ఈ ప్రతిపాదనను బలపరచగా, సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.