News October 16, 2024
మైనర్పై లైంగిక దాడి.. ప్రకాశం జిల్లా వాసికి పదేళ్ల జైలు శిక్ష

2019లో వనస్థలిపురం PSలో ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన అనిల్ పై పోక్సో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. ప్రేమ పేరుతో బంధువైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం అపహరించి పెళ్లి చేసుకున్న కేసులో నిందితుడికి న్యాయస్థానం పదేళ్ల శిక్ష, రూ.15వేల జరిమానా విధించింది. అనంతరం నిందితుడిని దోషిగా నిర్ధారించి మంగళవారం రంగారెడ్డి జిల్లా జడ్జి శిక్ష విధించారు.
Similar News
News November 9, 2025
ఒంగోలు: మీరు వెళ్లే బస్సు బాగుందా? లేదా?

వరుస ప్రమాదాల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని పలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. చాలా వాటిపై కేసులు నమోదు చేశారు. స్కూళ్లు, కాలేజీ బస్సుల పనితీరుపైనా ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దీంతో సంతనూతలపాడు పోలీస్లు శనివారం ప్రైవేట్ స్కూల్ బస్సులను చెక్ చేశారు. ఫస్ట్ ఎయిడ్ కిట్, అగ్నిమాపక పరికరాలు ఉన్నాయా? లేదా? అని తీశారు. మీరు వెళ్లే స్కూల్/కాలేజీ బస్సులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 9, 2025
ప్రకాశం జిల్లా ప్రజలకు గమనిక

సీఎం చంద్రబాబు ఈనెల 11న ప్రకాశం జిల్లాకు రానున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. సమస్యలపై అర్జీలు ఇవ్వడానికి దూర ప్రాంతాల నుంచి ఎవరూ ఒంగోలుకు రావద్దని సూచించారు.
News November 9, 2025
‘మీ కోసం’ రద్దు: కలెక్టర్

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 11న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న సోమవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన ‘మీ కోసం’ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజాబాబు శనివారం తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. దూర ప్రాంతాల నుంచి ఎవరూ అర్జీలు అందించేందుకు జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు.


