News March 30, 2025
మైనర్లకు వాహనాలు ఇచ్చి చిక్కుల్లో పడొద్దు: VZM SP

మైనరు డ్రైవింగుతో చట్టపరమైన చిక్కులు తప్పవని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. 18 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వ్యక్తులు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అటువంటి వ్యక్తులు డ్రైవింగు చేయుట వలన రహదారి ప్రమాదాలు, అనర్థాలు జరిగేఅవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారకులైతే ప్రమాద భీమాను చెల్లించేందుకు సదరు భీమా కంపెనీలు నిరాకరిస్తాయన్నారు.
Similar News
News November 20, 2025
భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.
News November 19, 2025
జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.
News November 19, 2025
జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు లబ్ది: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అన్నారు. వేపాడ తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో జరిగిన అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ రెండవ విడత నిధుల విడుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే లలిత కుమారి కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. అధిక వర్షాలు నమోదవడం వల్ల జిల్లాలో వరి పంటకు మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. జిల్లాలో 2.27 లక్షల మంది రైతులకు రూ.150 కోట్లు జమచేశామన్నారు.


